Gossipsఎవరు ఊహించని విధంగా భరత్ క్లైమాక్స్.. మహేష్ రేంజ్ చూపిస్తుందట..!

ఎవరు ఊహించని విధంగా భరత్ క్లైమాక్స్.. మహేష్ రేంజ్ చూపిస్తుందట..!

కొరటాల శివ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ హీరోగా శ్రీమంతుడు కాంబినేషన్ రిపీట్ చేస్తూ వస్తున్న సినిమా భరత్ అనే నేను. ఏప్రిల్ లో రిలీజ్ అవబోతున్న ఈ సినిమా క్లైమాక్స్ షూటింగ్ ప్రస్తుతం జరుగుతుందట. దీనికి సంబందించిన ఇంట్రెస్టింగ్ డీటైల్స్ బయటకు వచ్చాయి. కొంతమంది జూనియర్ ఆర్టిస్టులతో ఈ క్లైమాక్స్ ఉంటుందని.. వీరితో పాటుగా సినిమా తారాగణం అంతా క్లైమాక్స్ లో ఉంటారట.

భారీగా భరత్ అనే నేను క్లైమాక్స్ ఉంటుందని చెబుతున్నారు. ప్రీ క్లైమాక్స్ భారీ ఫైట్ అనంతరం కొరటాల శివ మార్క్ డైలాగ్స్ తో ఈ క్లైమాక్స్ ఆకట్టుకుంటుందని అంటున్నారు. డివివి దానయ్య నిర్మిస్తున్న భరత్ అనే నేను సినిమాలో బాలీవుడ్ భామ కియరా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అదిస్తున్న ఈ సినిమా ఆడియో మార్చ్ రెండో వారంలో రిలీజ్ చేస్తారట.

మరి ఊహించని రేంజ్ లో క్లైమాక్స్ అని ఊరిస్తున్న మహేష్ సినిమాతో గట్టి హిట్ కొట్టేందుకే పెద్ద స్కెచ్ వేశాడని అనిపిస్తుంది. సినిమా అంచనాలను అందుకుంటే మాత్రం మహేష్ స్టామినా మరోసారి ప్రూవ్ చేసేలా కలక్షన్స్ వచ్చే అవకాశం ఉంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news