గూగుల్ ని షేక్ చేస్తున్న భరత్ అనే నేను..!

సూపర్ స్టార్ మహేష్ కొరటాల శివ కలిసి శ్రీమంతుడు తర్వాత చేస్తున్న సినిమా టైటిల్ ఈ నెల 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా రివీల్ చేయనున్నారు. మహేష్ సినిమాలో సిఎం రోల్ చేస్తున్నాడని తెలిసిందే. ఇక ఈ సినిమా ప్రమోషన్ కూడా సరికొత్త పంథాలో చేస్తున్నాడు కొరటాల శివ. 26 ఉదయం 7 గంటలకు మహేష్ ప్రమాణ స్వీకారం ఆడియో రిలీజ్ చేస్తారట.

సో ఫస్ట్ లుక్ టీజర్ లాంటిది కాకపోతే అది ఆడియోగా వస్తుందని అంటున్నారు. దానితో పాటుగా టైటిల్ కూడా రివీల్ చేస్తారట. ఆరోజు ఉదయం 26 గంటలకే మహేష్ ఫస్ట్ ఓథ్ (ప్రమాణ స్వీకారం) అని కొరటాల శివ ట్విట్టర్ లో పేర్కొన్నారు. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ భామ కియరా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది.

ఇక ఈ సినిమా గురించి ఇలా న్యూస్ వచ్చిందో లేదో అలా గూగుల్ లో ట్రెండ్ అవుతూ వచ్చింది. ట్విట్టర్ టాప్ ట్రెండింగ్ లో ఇది సెకండ్ ప్లేస్ లో ఉంది. మహేష్ సినిమా పై ఫ్యాన్స్ ఎంత ఈగర్ గా ఉన్నారో దీనికి మించిన ఉదాహరణ ఉండదని చెప్పొచ్చు. ఏప్రిల్ 27 రిలీజ్ అనుకుంటున్న ఈ సినిమా మహేష్ కు బంపర్ హిట్ ఇస్తుందని అంటున్నారు.

Leave a comment