అజ్ఞాతవాసి వారం రోజుల కలక్షన్స్.. డిస్ట్రిబ్యూటర్స్ కు దిమ్మతిరిగే షాక్..!

పవన్ కళ్యాణ్ త్రివిక్రం కాంబోలో వచ్చిన అజ్ఞాతవాసి సినిమా టాక్ ఎలా ఉన్నా సరే పవన్ స్టామినా చూపించేలా కలక్షన్స్ వస్తాయని భావించారు. కాని పరిస్థితి చూస్తే వేరేలా ఉంది. మొదటి రెండు రోజులు హడావిడి చేసినా ఫ్లాప్ టాక్ పాకేయడంతో సినిమా కలక్షన్స్ బాగా తగ్గిపోయాయి. 125 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో రిలీజ్ ముందు బీభత్సం సృష్టించిన అజ్ఞాతవాసి రిలీజ్ తర్వాత చేతులు ఎత్తేశాడు.

ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం సినిమా వారం రోజులకు  కలక్షన్స్ మొత్తం 52 కోట్ల షేర్ వసూళు చేసిందట. తెలుగు రెండు రాష్ట్రాల్లోనే 32 కోట్ల షేర్ వసూళు చేయగా.. ప్రపంచవ్యాప్తంగా 52.50 కోట్ల కలక్షన్స్ రాబట్టిందట.

ఏరియాల వారిగా కలక్షన్స్ ఎలా ఉన్నాయంటే :

నైజాం – 10 కోట్లు

సీడెడ్ – 4.75 కోట్లు

నెల్లూరు – 2.12 కోట్లు

గుంటూర్ – 4. 81 కోట్లు

కృష్ణా – 2.8 కోట్లు

వెస్ట్ గోదావరి – 4.2 కోట్లు

ఈస్ట్ గోదావరి – 3.5 కోట్లు

ఉత్తరాంధ్ర – 4.7 కోట్లు

రిలీజ్ అయిన వారం రోజులకు అజ్ఞాతవాసి రాబట్టిన కలక్షన్స్ మొత్తం లెక్క ఇది.

RGV’s God, Sex and Truth ట్రైలర్

Leave a comment