3టికెట్ల ధర తెలిస్తే షాకే… టాలీవుడ్ చరిత్రలోనే ఇది ఒక సునామి

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన అజ్ఞాతవాసి సినిమా రేపు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుండగా సినిమా రిలీజ్ కు ముందే ఈ సినిమా రికార్డుల పని పడుతుంది. ప్రపంచవ్యాప్తంగా పవర్ స్టార్ ఫ్యాన్స్ గురించి అందరికి తెలిసిందే.. చెన్నైలో ఉన్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ 3 టికెట్లను ఏకంగా 1 లక్షా 71 వేలకు కొనేశారట. చెన్నై ఎస్.ఆర్.ఎం కాలేజ్ స్టూడెంట్స్ ముగ్గురు మొదటి టికెట్ ను 92 వేలు, రెండవ టికెట్ 59 వేలు, మూడవ టికెట్ 39 వేలకు కొనేశారట.

వేలం ద్వారా వీరు ఈ టికెట్లు పొందటం జరిగిందట. 3 టికెట్లు ఈ రేంజ్ లో అమ్ముడవం సౌత్ ఇండియాలోనే ఇది రికార్డ్ అని అంటున్నారు. ఇక ఈ వేలం ద్వారా వచ్చిన మొత్తాన్ని సేవా కార్యక్రమాలకు వాడుతారని తెలుస్తుంది. ఇదవరకు చెన్నైలో ఇదే కాలేజ్ స్టూడెంట్స్ జనతా గ్యారేజ్, ఖైది నంబర్ 150, కాటమరాయుడు, జై లవకుశ, స్పైడర్ సినిమాలకు వేలం వేశారు.

అయితే మునుపెన్నడు ఈ రేంజ్ లో టికెట్లు అమ్ముడవ్వలేదని తెలుస్తుంది. ప్రస్తుతం 3 టికెట్లు కొన్న వారి పిక్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. చూస్తుంటే అజ్ఞాతవాసి కోసం పవర్ స్టార్ ఫ్యాన్స్ బీభత్సంగా ఉంటుందని చెప్పొచ్చు.

Leave a comment