నితిన్ సినిమాకు త్రివిక్రం క్లాసీ టచ్..ఎంతవరకు నిజం..?

లై సినిమాతో నిరాశ పరచిన నితిన్ ప్రస్తుతం కృష్ణ చైతన్య డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్, శ్రేష్ట్ మూవీస్ కలిసి నిర్మిస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమా మూలకథ త్రివిక్రం శ్రీనివాస్ అందిస్తుండటం విశేషం. అందుకే ఈ సినిమాకు వెరైటీ టైటిల్ పెట్టారు. ఇంతకీ ఆ టైటిల్ ఏంటి అంటే గుర్తుందా శీతాకాలం.

సినిమాపై ఆడియెన్స్ అంచనాలు ఏర్పరచుకునేందుకు టైటిల్స్ ఉపయోగపడతాయి. ఇక నితిన్ కొత్త సినిమా టైటిల్ చూస్తుంటే ఇది పక్కా త్రివిక్రం మార్క్ సినిమాగా అనిపిస్తుంది. దర్శకుడు కృష్ణ చైతన్య కూడా సినిమాను చాలా క్లాస్ గా తెరకెక్కించాడని అంటున్నారు. గుర్తుందా శీతాకాలం అంటూ రాబోతున్న నితిన్ సినిమాతో సూపర్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు.

తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా ఎక్కువ భాగం యూఎస్ లో షూటింగ్ జరుపుకుంది. లైలో నితిన్ తో జతకట్టిన మేఘా ఆకాష్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమా 2018 ఫిబ్రవరి నెలలో రిలీజ్ చేయాలని చూస్తున్నారు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమా నితిన్ కోరుకునే హిట్ అందిస్తుందో లేదో చూడాలి.

Leave a comment