Gossipsరకూల్ పనైపోయిందా..? అను టైం స్టార్ట్ అయ్యిందా ..?

రకూల్ పనైపోయిందా..? అను టైం స్టార్ట్ అయ్యిందా ..?

అను ఇమ్మాన్యుయేల్ ! ఈ మలయాళీ ముద్దుగుమ్మ వరుస వరుసగా ఇండ్రస్ట్రీలో ఉన్న టాప్ హీరోయిన్లు అందరికి ఎర్త్ పెట్టేస్తోంది. ‘అజ్ఞాతవాసి’ సినిమాలో పవన్ సరసన అను, కీర్తి సురేష్‌లు నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ఆడియో ఫంక్షన్ లో కీర్తీ సురేష్ కంటే అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం అనునే.

అయితే ఈ బ్యూటీ 2017లో ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’, ‘ఆక్సిజన్’ చిత్రాలతో పాటు విశాల్ సరసన ‘డిటెక్టివ్’ చిత్రంలోనూ నటించింది. అయితే డిటెక్టివ్ చిత్రం ఓ మోస్తరు విజయాన్ని నమోదు చేయగా మిగతా రెండు చిత్రాలు నిరాశనే మిగిల్చాయి. అయినా తన అందం, అభినయంతో ‘అజ్ఞాతవాసి’ సినిమాలో పవన్ సరసన నటించే అవకాశాన్ని కొట్టేసి లక్కీ గర్ల్ అనిపించుకుంది.

రాబోయే రోజుల్లో అను బిజీ హీరోయిన్‌గా మారే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ‘అజ్ఞాతవాసి’ సినిమాతో 2018 ఏడాది ప్రారంభిస్తున్న అనూ.. అల్లు అర్జున్ సరసన ‘నాపేరు సూర్య’, అక్కినేని నాగచైతన్య-మారుతి కాంబినేషన్లో రాబోతోన్న ‘శైలజారెడ్డి అల్లుడు’ సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉంది. వీటితో పాటు చెర్రీ- బోయపాటి కాంబినేషన్ మూవీకి, సాయిధరమ్ తేజ్ సినిమాలకు ఈమెనే ఓకే చేశారు. ఇక మరో నాలుగు సినిమాలు లైన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఒకే ఏడేది ఇన్ని సినిమాలు రావడం అదీ స్టార్ హీరోల పక్కన ఛాన్స్ రావడంతో అను ఇమ్మానుయేల్‌‌కి అన్నీ కలిసి వస్తే 2018 టాప్ హీరోయిన్ అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.

ఒకరకంగా చెప్పాలంటే… ఇప్పుడు అను కి వస్తున్న ఆఫర్లు అన్ని వాస్తవంగా రకూల్ కి రావాల్సి ఉండగా ఆమెను వెనుక్కి నెట్టి అని కొట్టేస్తోంది. మొన్నటి వరకు వరుస హిట్ సినిమాల్లో నటించి అందరిని మెప్పించిన రకూల్ ఇప్పటి వరకు టాప్ హీరోయిన్ గానే కొనసాగింది అయితే ఆ స్థానాన్ని రకూల్ తొందర్లోనే కాళీ చేసే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే అను ఆ ప్లేస్ ఆక్రమించేయబోతోంది కదా !

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news