” ఒక్క క్షణం ” రివ్యూ & రేటింగ్

శ్రీరస్తు శుభమస్తు సినిమాతో లాస్ట్ ఇయర్ హిట్ అందుకున్న అల్లు శిరీష్ విఐ ఆనంద్ డైరక్షన్ లో ఒక్క క్షణం సినిమాతో నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. టైగర్, ఎక్కడికిపోతావు చిన్నవాడా సినిమాలతో హిట్ అందుకున్న దర్శకుడు అల్లు శిరీష్ తో ఎలాంటి సినిమా తీశాడు అన్నది ఈనాటి సమీక్షలో చూద్దాం. శిరీష్ సరసన సురభి హీరోయిన్ గా నటించగా అవసరాల శ్రీనివాస్, సీరత్ కపూర్ లు ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు.

కథ :

జీవ (శిరీష్) సురభిని ప్రేమిస్తాడు. ఫ్యామిలీతో జీవితాన్ని సరదాగా గడుపుతున్న జీవాకు తమ జీవితాల్లానే పార్లర్ గా ఉన్న ఇద్దరు వ్యక్తులు పరిచయమవుతారు. హీరో హీరోయిన్ ప్రెజెంట్ వారి పాస్ట్ గా జరుగుతుంటుంది. ఈ విషయంపై కాలేజ్ లైఫ్ లో ప్రొఫెసర్ చెప్పిన డెస్టినీ పాఠాన్ని తన లైఫ్ లో అప్లై చేస్తాడు అల్లు శిరీష్. అవసరాల శ్రీనివాస్, సీరత్ కపూర్ ల లైఫ్ లానే తమ జీవితం కూడా వెళ్తుందని భావించీ జీవా డెస్టినీతో పోరాడి ఎలా గెలిచాడు అన్నది అసలు కథ.

నటీనటుల ప్రతిభ :

జీవాగా అల్లు శిరీష్ పర్వాలేదు అనిపించుకున్నాడు. సినిమా సినిమాకు తనలో డెవలప్మెంట్ కనిపిస్తుంది. సురభి హీరోయిన్ గా ఆకట్టుకుంది. అయితే సినిమాలో శిరీష్ కన్నా అవసరాల శ్రీనివాస్ పాత్ర ఎక్కువ ఇంప్యాక్ట్ కలుగచేస్తుంది. ఆ పాత్రలో శ్రీనివాస్ అదరగొట్టాడు. ఇక సీరత్ కపూర్ ఎప్పటిలానే హాట్ లుక్ తో ఆకట్టుకుంది. ఇక జయ ప్రకాశ్ కూడా మంచి పాత్రలో ఆకట్టుకున్నారు. మిగతా పాత్రలన్ని అలరించాయి.

సాంకేతికవర్గం పనితీరు :

దర్శకుడు కథ కథనాల్లో కొత్తదనం చూపించాలని చేసిన ప్రయత్నం బాగుంది. స్క్రీన్ ప్లే టైట్ గా రాసుకున్నారు. అయితే సెకండ్ హాఫ్ సినిమాను నిలబెట్టలేదు. శ్యాం కె నాయుడు సినిమాటోగ్రఫీ బాగుంది. మణీశర్మ మ్యూజిక్ ఒకే. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంది. అబ్బూరి రవి మాటలు ఆకట్టుకున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి.

విశ్లేషణ :

ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాతో దర్శకుడి ప్రతిభ తెలియగా అదే తరహాలో అల్లు శిరీష్ తో ఒక్క క్షణం పర్ఫెక్ట్ స్క్రీన్ ప్లేతో వచ్చింది. సినిమా కథ కథనాలు కాపీనా.. వేరే సినిమా రిఫరెన్సా అన్నది పక్కన పెడితే సినిమా మాత్రం తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందిస్తుందని చెప్పొచ్చు. మొదటి భాగం అంతా ఇంట్రెస్టింగ్ గా నడిపించిన దర్శకుడు సెకండ్ హాఫ్ నిలబెట్టలేకపోయాడు.

కొన్ని నమ్మశక్యం కాని లాజిక్ లేని సీన్స్ వస్తుంటాయి. ఆడియెన్స్ ను కథకు ఎంగేజ్ చేయడంలో మాత్రం సక్సెస్ అయిన దర్శకుడు చివరిదాకా అది నడిపించలేకపోయాడు. మొత్తానికి ఎక్కడికిపోతావు చిన్నవాడా తర్వాత అలాంటి ఓ ప్రయోగాత్మక సినిమాతోనే వచ్చిన విఐ ఆనంద్ మంచి ప్రయత్నం చేశారని చెప్పొచ్చు.

యూత్ ఆడియెన్స్ కనెక్ట్ అయితే కనుక సినిమా మళ్లీ శిరీష్ కు హిట్ అందించినట్టే. ట్రైలర్ తో అంచనాలు పెంచేసిన ఈ సినిమా ఆడియెన్స్ ను థ్రిల్ చేయడంలో సఫలమైంది.

ప్లస్ పాయింట్స్ :

స్క్రీన్ ప్లే

బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్

కెమెరా వర్క్

మైనస్ పాయింట్స్ :

సెకండ్ హాఫ్

మిస్సింగ్ ఎంటర్టైన్మెంట్

బాటం లైన్ :

అల్లు శిరీష్ ఒక్క క్షణం.. మంచి ప్రయత్నమే కాని..!

TL రివ్యూ & రేటింగ్ : 2.5/5