Gossips"ఒక్క క్షణం" కలెక్షన్స్ చూసి బయ్యర్లకు హార్ట్ ఎటాక్..!

“ఒక్క క్షణం” కలెక్షన్స్ చూసి బయ్యర్లకు హార్ట్ ఎటాక్..!

అల్లు శిరీష్ హీరోగా విఐ ఆనంద్ డైరక్షన్ లో వచ్చిన సినిమా ఒక్క క్షణం. లాస్ట్ ఇయర్ డిసెంబర్ కు ఎక్కడికి పోతావు చిన్నవాడా అంటూ వచ్చి హిట్ అందుకున్న విఐ ఆనంద్ సైన్స్ ఫిక్షన్ మూవీగా ఒక్క క్షణం తీశాడు. ఇక అల్లు శిరీష్ కూడా శ్రీరస్తు శుభమస్తు హిట్ తర్వాత చేసిన సినిమాగా ఒక్క క్షణం క్రేజ్ తీసుకొచ్చింది.

దర్శకుడు హీరో ఇద్దరు లాస్ట్ సినిమా హిట్ కొట్టడంతో వారి కాంబినేషన్ లో వస్తున్న ఒక్క క్షణం పక్కా హిట్ అని బయ్యర్లు ఈ సినిమాను భారీ రేటుకే కొనేశారట. చక్రి చిగురుపాటి నిర్మించిన ఈ సినిమా అయిన బడ్జెట్ కన్నా డిస్ట్రిబ్యూటర్ కు అమ్మిన రేటు ఇంచుమించు డబుల్ ఉందని అంటున్నారు. అయితే సినిమా గురువారం రిలీజ్ అవగా మొదటి రోజు కేవలం 55 లక్షల షేర్ వసూళు చేయడంతో బయ్యర్లకు హార్ట్ ఎటాక్ వచ్చినంత పని జరిగిందట.

వారాంతరంలో ఏమైనా పుంజుకుంటే తప్ప లేదంటే సినిమాకు బయ్యర్లు భారీ లాస్ తప్పదని అంటున్నారు. సినిమాపై ఎంతో నమ్మకం పెంచుకున్న శిరీష్ రిజల్ట్ చూసి షాక్ అయ్యాడట. అయితే సినిమా మొదటి రోజు సాయంత్రం చిత్రయూనిట్ మాత్రం సక్సెస్ అయ్యిందని కేక్ కట్ చేయడం విశేషం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news