MoviesMCA రివ్యూ & రేటింగ్

MCA రివ్యూ & రేటింగ్

వరుస విజయాలతో దూసుకుపోతున్న నాని శ్రీరాం వేణు డైరక్షన్ లో ఎం.సి.ఏ సినిమాతో వస్తున్నాడు. దిల్ రాజు నిర్మాణంలో వచ్చిన ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. భూమిక ప్రత్యేకమైన పాత్రలో నటించిన ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరి ఈ మిడిల్ క్లాస్ అబ్బాయి ప్రేక్షకులను అలరించేలా ఉన్నాడా లేడా అన్నది ఈనాటి సమీక్షలో చూసేద్దాం.
కథ :
మిడిల్ క్లాస్ అబ్బాయ్ గా తన జీవితాన్ని తను గడుపుతున్న నాని (నాని) సడెన్ గా అన్న (రాజీవ్ కనకాల) కోరిక మేరకు వదిన (భూమిక) కోసం వరంగల్ వెళ్లాల్సి వస్తుంది. ఇక అక్కడ పల్లవి (సాయి పల్లవి)తో ప్రేమలో పడతాడు. అంతా సజావుగా సాగుతుంది అనుకున్న టైంలో వదిన చేస్తున్న ఆఫీస్ లో ప్రాబ్లెం వస్తుంది. అప్పటి దాకా వదినను అసహ్యించుకునే నాని ఆమె కోసం విలన్ తో పోరాడతాడు. అసలు ఇంతకీ ఆమెను విలన్లు ఎందుకు టార్గెట్ చేస్తాడు..? నాని విలన్ ను ఎలా ఎదుర్కున్నాడు..? చివరకు కథ ఎలా ముగిసింది అన్నది తెర మీద చూడాల్సిందే.
నటీనటుల ప్రతిభ :
నాచురల్ స్టార్ నాని మరోసారి తన నాచురల్ నటనతో ఆకట్టుకున్నాడు. ఎలాంటి పాత్రలో అయినా ఇట్టే దూరిపోయే నాని ఈసారి తన పాత్రనే స్క్రీన్ మీద చూపించినట్టు అనిపిస్తుంది. ఇక హీరోయిన్ గా సాయి పల్లవి రోల్ తక్కువే అని చెప్పాలి. ఉన్నంతలో ఆమె ఆకట్టుకుంది. సినిమాలో భూమిక రోల్ ఎక్కువగా ఉంటుంది. ఆ రోల్ కు ఆమెనే ఎందుకు తీసుకున్నారు అన్నది సినిమా చూస్తే అర్ధమవుతుంది. భూమిక మళ్లీ ఫాంలోకి వచ్చేలా ఈ సినిమా ఉపయోగపడుతుంది. రాజీవ్ కనకాల, ప్రియదర్శి ఇలా అందరు తమ పాత్రలకు న్యాయం చేశారు.
సాంకేతిక వర్గం పనితీరు :
దర్శకుడు వేణు శ్రీరాం రొటీన్ స్టోరీనే రాసుకున్నాడని చెప్పొచ్చు. మిడిల్ క్లాస్ అబ్బాయి అనే టైటిల్ పెట్టి మొదటి భాగం అలరించినా సెకండ్ హాఫ్ మరి ఫ్లాట్ గా రన్ చేశాడు. దర్శకుడు ఫెయిల్ అయినట్టే అని చెప్పొచ్చు. ఇక సినిమాలో దేవి మ్యూజిక్ ఏమాత్రం ఆకట్టుకోలేదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అసలు అలరించలేదు. సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా దిల్ రాజు స్టాండర్డ్స్ లో లేవని చెప్పొచ్చు.
విశ్లేషణ :
ఓ మిడిల్ క్లాస్ అబ్బాయి ఎలా ఉంటాడో కుటుంబానికి ఆపద వస్తే ఎలా రియాక్ట్ అవుతాడో ఆ పాయింట్ తో రాసుకున్న దర్శకుడు శ్రీరాం వేణు ఎం.సి.ఏ కథ రొటీన్ పంథాలో సాగింది. మొదటి భాగం వరకు డైలాగ్స్ తో అలరించినా సెకండ్ హాఫ్ మరి బోర్ కొట్టేలా ఉంటుంది. హీరో కాబట్టి వదినకు వచ్చిన ఆపద నుండి అతను విలన్ తో ఫైట్ చేయడం ఎన్ని సినిమాల్లో చూసేశాం.
కథ కథనాల విషయంలో ముఖ్యంగా సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే రొటీన్ గా సాగడం పట్ల ఆడియెన్స్ నిరాశకు గురయ్యే అవకశం ఉంది. వరుస విజయాలను అందుకుంటున్న నాని మరి ఇంత రొటీన్ స్టోరీని ఎలా యాక్సెప్ట్ చేశాడని అనుకుంటున్నారు. సినిమాలో నాని పరంగా 100 కి 100 మార్కులు వేసేయొచ్చు. సాయి పల్లవిని సరిగా వాడుకోలేదు.
క్లైమాక్స్ కూడా అందరు ఊహించేదిగా ఉంటుంది. ఓ మై ఫ్రెండ్ తర్వాత శ్రీరాం వేణు డైరక్షన్ లో వచ్చిన ఈ ఎం.సి.ఏ నానికి తగిన సినిమా కాదని చెప్పాలి. కథ కథనాలన్ని రొటీన్ పంథలో సాగడంతో ఆడియెన్స్ ఈ సినిమాను ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. మొదటి భాగం బాగా అలరించిన దర్శకుడు సెకండ్ హాఫ్ మాత్రం బోర్ కొట్టించేశాడు.
ప్లస్ పాయింట్స్ :
నాని
భూమిక
సినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్ :
రొటీన్ స్టోరీ
మ్యూజిక్
సెకండ్ హాఫ్
బాటం లైన్ :
నాని ఎం.సి.ఏ రొటీన్ సినిమానే..!
రేటింగ్ : 2.75/5

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news