Gossips" MCA "కలెక్షన్లు.. బోల్తాకొట్టాయ..

” MCA “కలెక్షన్లు.. బోల్తాకొట్టాయ..

వరుస సక్సెస్‌లో మంచి ఊపుమీద ఉన్న నాని ఈ ఏడాది నేను లోకల్, నిన్నుకోరి లాంటి బ్లాక్‌బస్టర్ హిట్‌ల తరువాత ఫిదా బ్యూటీ సాయి పల్లవి జంటగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్ బ్యానర్‌లో దిల్ రాజు నిర్మించిన ఫ్యామిలీ అండ్ లవ్ ఎంటర్టైనర్ మూవీ ఎంసీఏ-మిడిల్ క్లాస్ అబ్బాయి బాక్సఫీసు వద్ద మంచి కలెక్షన్లే రాబడుతోంది. నాని కెరియర్ లోనే మంచి ఫ్యామిలీ సినిమాగా మిడిల్ క్లాస్ అబ్బాయి దూసుకుపోతోంది.

పెద్ద స్టార్ హీరోల కలెక్షన్లతో పోటీపడుతూ ఉదయం మధ్యాహ్నం ఆటలకే మంచి ఓపెనింగ్స్ అందుకున్నాయి. ఈ సినిమా ఆధ్యాంతం ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ లో నడవడంతో కుటుంబ కథాచిత్రంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాకి వసూళ్లు కూడా బాగుండడంతో చిత్ర యూనిట్ కూడా మంచి హుషారుగా కనిపిస్తోంది.

మొత్తం మీద మొదటి రోజు సినిమా 6.5 కోట్ల నుంచి 7 కోట్ల మధ్యలో షేర్ ని సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ సినిమా దెబ్బకి ఇప్పుడు టాలీవుడ్‌లోని స్టార్ హీరోల జాబితాలో చేరుపోయాడు నాని. మినిమమ్ గ్యారెంటీ హీరోగా ఇండ్రస్ట్రీలో ఇప్పటికే పేరు తెచ్చుకోగా ఈ సినిమా దెబ్బకి స్టార్ స్టేట్స్ కొట్టేసాడు. ఈ సినిమాకి మౌత్ పుబ్లిసిటీ కూడా ఎక్కువగా ఉండడంతో మహిళలు కూడా పెద్ద ఎత్తున థియేటర్లకు వస్తున్నారు. అయితే ఇప్పటికే రిలీజ్ కి సిద్ధం గా ఉన్న హలో వంటి సినిమాలు నానికి ఎంతమేరకు పోటీ ఇస్తాయో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news