Moviesకిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్‌ "రివ్యూ & రేటింగ్"

కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్‌ “రివ్యూ & రేటింగ్”

టైటిల్‌: కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్‌
బ్యాన‌ర్‌: ధృవ ప్రొడ‌క్ష‌న్‌
న‌టీన‌టులు: కిర‌ణ్‌, హ‌ర్షద కుల‌క‌ర్ణి, గాయ‌త్రీ గుప్త‌
సినిమాటోగ్ర‌ఫీ: సిద్ధ‌.కె
మ్యూజిక్‌: జీవీ
నిర్మాత‌: సుజ‌న్‌
ద‌ర్శ‌క‌త్వం: కార్తీక్ మేడికొండ‌
రిలీజ్ డేట్‌: 14 డిసెంబ‌ర్‌, 2017

టైటిల్ తోనే విచిత్రమైన టాక్ తెచ్చుకున్న ఈ సినిమా , ట్రైలర్ ద్వారా కొంత ఆసక్తి రేకెత్తించింది. డార్క్ జానర్, ఫిలిం నాయర్ ని చెబుతూ వస్తున్నా ఈ సినిమా ఎలా ఉందో ఒక సారి చూద్దాము.

క‌థ :

ఈ సినిమా క‌థ విష‌యానికి వ‌స్తే మెట్రో క‌ల్చ‌ర్‌కు అలవాడు ప‌డ్డ ఆర్య‌న్ (కిర‌ణ్‌) త‌న స్నేహితురాలు స్వీటీ (హ‌ర్ష‌ద‌ కుల‌క‌ర్ణి)తో స‌హ‌జీవ‌నం చేస్తుంటాడు. వారిద్ద‌రి మ‌ధ్య అగాధాలు రావ‌డంతో పాటు స్వీటీ త‌న‌కంటే ఎక్కువ మ‌నీ సంపాదిస్తుంద‌ని ఫీల్ అయిన ఆర్య‌న్ ఆమెను ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మంటాడు. స్వీటీ మాత్రం ఆర్య‌న్ మాట లైట్ తీస్కొని ఆ ఇంట్లోనే ఉంటుంది. చివ‌ర‌కు ఆర్య‌నే ఆ ఇంట్లో నుంచి బ‌య‌ట‌కు వెళ‌తాడు. అప్ప‌టి నుంచి ఆర్య‌న్ జీవితంలో అనేక స‌మ‌స్య‌లు ఎదుర్కోవాల్సి వ‌స్తోంది. ఆర్య‌న్ త‌న‌కు సంబంధం లేని హ‌త్య కేసులో ఇరుక్కుంటాడు. ఆర్య‌న్‌ను ఓ కాల్ గ‌ర్ల్ (గాయ‌త్రి గుప్త‌) బ్లాక్ మెయిల్ చేస్తుంటుంది. ఇదిలా ఉంటే ఈ టైంలో కొన్ని స‌మ‌స్య‌ల్లో ఇరుక్కున్న స్విటీ ఆత్మ‌హ‌త్య చేసుకుని చ‌నిపోవ‌డంతో ఆర్య‌న్‌కు పోలీసుల గోల స్టార్ట్ అవుతుంది. అస‌లు ఆ హ‌త్య‌కు ఆర్య‌న్‌కు లింక్ ఏంటి ? ఆ కాల్ గ‌ర్ల్ ఆర్య‌ను ఎందుకు బ్లాక్ మెయిల్ చేస్తుంటుంది ? స్వీటీ ఎందుకు ఆత్మ‌హ‌త్య చేసుకుంది ? ఈ ప్ర‌శ్న‌ల‌కు కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్‌లో స‌మాధానాలు దొరుకుతాయి.

విశ్లేషణ:

ఆర్యన్ క్యారెక్టర్ లోని చేతకాని తనాన్ని పరిచయం చేస్తూ నడిపిన మొదటి భాగం , సో సో గా నెమ్మదిగా నడుస్తుంటుంది. ప్రేక్షకుడికి ఏం జరుగుతుందో అర్ధం కాదు. స్వీటీ హత్యతో అసలు కథ మొదలు అవుతుంది. అక్కడినుండి ఒక్కొక్క సీన్ ని ఎక్స్ప్లోర్ చేసే కొద్ది ఇంటరెస్టింగ్ గా సాగుతుంది ఈ సినిమా. అయితే ఎంటర్టైన్మెంట్ పూర్తిగా లేకపోవడం. డార్క్ థీమ్ తో సినిమాని తీయడం వల్ల వెంటనే గొప్పగా నచ్చకపోవచ్చు. అలాగే వీక్ గా ఉన్న మొదటి భాగం కూడా ఈ సినిమా కి కాస్త మైనస్. ఓవరాల్ గా చెప్పాలంటే కొత్తగా ఉంది. కాని కమర్షియల్ ఎలెమెంట్స్ ను ఆశించి వచ్చే వారికి కిస్ దక్కోచ్చేమో గాని బ్యాంగ్ మాత్రం దక్కదు.

ఇక న‌టీన‌టుల విష‌యానికి వ‌స్తే గాయ‌త్రి గుప్తా రోల్‌కు ఎక్కువ మార్కులు వేయాలి. బోల్డ్ క్యారెక్ట‌ర్ అయినా ఆమె హుందాగా న‌టించింది. ఆమె డైలాగ్స్‌లో వైల్డ్‌నెస్ ఉంది. ఇక సినిమాలో మాస్‌ను, యూత్‌ను మెప్పించేలా రొమాంటిక్ సీన్లు డిజైన్ చేశారు. యూత్ వీటిని ఎంజాయ్ చేస్తారు. ఇక ద‌ర్శ‌కుడి స్క్రీన్ ప్లే డిఫ‌రెంట్‌గా ఉండ‌డంతో నెక్ట్స్ సీన్లు ఊహించ‌లేం. హీరో కిర‌ణ్ త‌న వ‌ర‌కు బాగానే చేశాడు. మ‌రో హీరోయిన్ హ‌ర్షద్ కుల‌క‌ర్ణి లుక్స్‌తో ఎట్రాక్ట్ చేసింది.

రేటింగ్ : 2.5/5

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news