టీడీపీని జగన్ అంత బయపెట్టేస్తున్నాడా ..?

ప్రజా సంకల్ప యాత్రలో జనాల్లో తిరుగుతూ… వారి కష్ట నష్టాలను స్వయంగా తెలుసుకుంటున్నారు వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్. పాదయాత్రలో తాను చుసిన సమస్యల మీద పార్టీ నాయకులతోనూ వాటిమీద చర్చించి దానికి అనుగుణంగా హామీలు ఇస్తున్నాడు. అందుకే ఎస్సీ, ఎస్టీలకు, వికలాంగులకు, చేనేత కార్మికులకు..45 యేళ్ల వయసుకే పెన్షన్ వచ్చే ఏర్పాటు చేస్తానని ఇదివరకే ప్రకటించాడు.

జగన్ హామీలు ఆచరణ సాధ్యం కాదని అధికార పార్టీ హేళన చేసినా జగన్ మాత్రం అవేవి పట్టించుకోకుండా తనదైన శైలిలో హామీలు ఇస్తూ ప్రజాభిమానాన్ని సంపాదించుకున్నాడు. జగన్ హామీలతో ఈ పార్టీకి ప్రజల్లో ఆదరణ పెరగడంతో టీడీపీకి కంటిమీద కునుకు లేకుండా పోతోంది. జగన్ హామీల మీద ఎన్నో చర్చలు నడిసినా … ఆ ప్రశ్నలన్నిటికీ జగన్ సమాధానం చెప్పాడు. పాదయాత్రలో భాగంగా తాను గ్రామాల్లోకి వెళ్లానని.. అనేక మంది పేద ప్రజల పరిస్థితులను గమనించాను. అక్కడి పరిస్థితులు చూసి నాకు బాధ కలిగి వారి కష్టాలు తీర్చేందుకు కొత్త కొత్త ఆలోచనలతో పథకాలను ప్రకటిస్తున్నట్టు జగన్ చెప్పుకొస్తున్నారు.

45 యేళ్లకే పెన్షనా అని చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నా.. జగన్ మాత్రం దాన్లో తప్పేముంది అంటూ సమర్ధించుకుంటున్నాడు. జగన్ ఇచ్చిన హామీలు ప్రజల్లోకి బాగానే చొచ్చుకెళ్తున్నాయి. దీంతో ఏమి చెయ్యాలో పాలుపోని టీడీపీ నాయకులు జగన్ మీద వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు. కేవలం జగన్ పై విమర్శలు చెయ్యడం ద్వారా మంత్రి పదవిని పొందిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, , వైసీపీ తరఫున గెలిచి ఫిరాయించి మంత్రి పదవి పొందిన ఆదినారాయణ రెడ్డి ఉన్నారు. వీరు జగన్ ను తాత అని సంబోధించి వెకిలిగా మాట్లాడుతూ ప్రజల్లో మరింత చులకన అవుతున్నారు.

జగన్ వయస్సు 45 సంవత్సరాలకు దగ్గర అవుతోందని, 45 సంవత్సరాలు దాటిన వారికి పెన్షన్ ఇస్తానని జగన్ హామీ ఇస్తున్నాడు కాబట్టి … జగన్ తాత అని వీళ్లు వెకిలి వ్యాఖ్యలు చేస్తున్నారు. జగన్ ఇచ్చిన హామీని తప్పు పట్టాలి అనుకుంటే వీళ్లు తప్పు పట్టవచ్చు. అయితే ఇటువంటి వెకిలి మాటలు మాట్లాడటం మాత్రం విడ్డూరమే అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. టీడీపీ పైకి ఎంత గంభీరంగా కనిపిస్తున్నప్పటికీ లో లోపల జగన్ గురించి ఆందోళన చెందుతున్నట్టు అర్ధం అవుతోంది.

Leave a comment