Movies" Hello "రివ్యూ & రేటింగ్

” Hello “రివ్యూ & రేటింగ్

అక్కినేని నట వారసుడు అఖిల్ హీరోగా మొదటి సినిమా డిజాస్టర్ కాగా విక్రం కుమార్ డైరక్షన్ లో అఖిల్ రెండో సినిమా హలోగా వస్తున్నాడు. నాగార్జున నిర్మించిన ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతుంది. కళ్యాణి ప్రియదర్శిని హీరోయిన్ గా నటించిన ఈ సినిమకు అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందించారు. మరి ఈ హలోతో అఖిల్ ఎలాంటి ఫలితం అందుకున్నాడో ఈనాటి సమీక్షలో చూసేద్దాం.

కథ :

శీను (అఖిల్) జున్ను (కళ్యాణి) ఇద్దరు చిన్ననాటి నుండి స్నేహితులుగా ఉంటారు. ఒకరినొకరిపై ఒకరు ఎంతో అభిమానం ప్రేమ చూపిస్తారు. జున్ను అంటే శీనుకి చెప్పలేనంత ప్రేమ. అనివార్య కారణాల వల్ల ఇద్దరు చిన్నప్పుడే విడిపోవాల్సి వస్తుంది. అయితే ఆమె ఫోన్ నెంబర్ ఇచ్చి వెళ్తుంది. ఇక లాస్ట్ రిసీవ్డ్ కాల్ లో జున్ను నెంబర్ ఉంటుంది. ఈలోగా తన ఫోన్ పోతుంది. అది వెతికే క్రమంలో విలన్ అజయ్ తో గొడవపడతాడు శీను. తన సోల్ మెట్ ను వెతికే క్రమంలో తను ఎన్నో స్టంట్స్, అడ్వెంచర్స్ చేస్తాడు. ఇంతకీ శీను, జున్నులు ఎందుకు విడిపోయారు..? ఎలా కలిశారు..? ఇద్దరి మధ్య ప్రేమ ఎలా చిగురించింది అన్నది తెర మీద చూడాల్సిందే.

నటీనటుల ప్రతిభ :

శీను గా అఖిల్ తన మొదటి సినిమా కన్నా పరిణితి చెందాడని చెప్పొచ్చు. సోల్ మేట్ ను వెతికే క్రమంలో ఫీల్ ను బాగా కన్వే చేయగలిగాడు. అఖిల్ అసలు టాలెంట్ ఈ సినిమాలో చూడొచ్చు. డ్యాన్స్, ఫైట్స్ అన్నిటిలో అఖిల్ ది బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చాడు. ఇక ఫీమేల్ లీడ్ గా నటించిన కళ్యాణి ప్రియదర్శిని కూడా బాగా నటించింది. తన క్యూట్ లుక్స్ తో సినిమాకు అదనపు ఆకర్షణ తెచ్చింది. విలన్ అజయ్ నటన ఆకట్టుకుంటుంది. శీను పేరెంట్స్ గా జగపతి బాబు, రమ్యకృష్ణ తమదైన స్టైల్ లో నటించి మెప్పించారు. ఇక మిగతా పాత్రలన్ని ప్రిధి మేరకు నటించి మెప్పించారు.

సాంకేతిక వర్గం పనితీరు :

దర్శకుడు విక్రం కుమార్ మరోసారి తన ప్రతిభ చాటాడని చెప్పొచ్చు. కథ చెప్పేందుకు చిన్నదే అయినా దాన్ని సినిమాగా చాలా గొప్ప స్క్రీన్ ప్లే తో తెరకెక్కించాడు. అనూప్ మ్యూజిక్ మరోసారి మ్యాజిక్ చేసింది. పి.ఎస్ వినోద్ సినిమాటోగ్రఫీ సినిమాకు కొత్త కలరింగ్ తెచ్చింది. కెమెరా వర్క్ చాలా నీట్ గా ఉంది. ప్రవీణ్ పుడి ఎడిటింగ్ ఓకే. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

విశ్లేషణ :

తన సోల్ మేట్ వెతికే క్రమంలో హీరో పడే తపన ఎంతో హృద్యంగా చూపించారు. సినిమా ఫీల్ ఎక్కడ తగ్గకుండా చేసేలా చూశారు. కథ ఇది అని ముందే తెలిసినా సరే దాన్ని రెండున్నర గంటలు సినిమాగా స్క్రీన్ ప్లే తో అలరించాడు. సినిమా మొత్తం శీను క్యారక్టర్ మీద నడిపించాడు. సినిమాలో కొన్ని మ్యాజికల్ మూమెంట్స్ ఆడియెన్స్ కు త్రిల్ కలిగిస్తాయి.

ముఖ్యంగా హీరో హీరోయిన్ సీన్స్ చాలా రీ ఫ్రెషింగ్ గా అనిపిస్తాయి. మ్యూజిక్ డైరక్టర్ అనూప్ మళ్లీ తన సత్తా చాటుకున్నాడు. క్లీన్ ఎంటర్టైనర్ గా హలో యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా మంచి మార్కులు కొట్టేస్తుంది. కథ కథనాలు అన్ని సినిమా మొత్తం మనసుకి హత్తుకునేలా విక్రం కుమార్ తెరకెక్కించాడు. మొదటి భాగం కాస్త ఎంటర్టైనింగ్ మోడ్ లో సాగగా సెకండ్ హాఫ్ సినిమాకు ప్రాణం అని చెప్పొచ్చు. యూత్ కు బాగా నచ్చేలా ఫీల్ గుడ్ మూవీతో పాటుగ స్టంట్స్ తో కూడా అలరించాడు అఖిల్.

ప్లస్ పాయింట్స్ :

అఖిల్, కళ్యాణి

స్క్రీన్ ప్లే

మ్యూజిక్

మైనస్ పాయింట్స్ :

కథ ఫ్లాట్ గా ఉండట,

రేటింగ్ : 3/5

బాటం లైన్ : అఖిల్ హలో అదరగొట్టేశాడు

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news