4 రోజుల కలక్షన్స్ తో ఇండస్ట్రీని షేక్ చేసిన అఖిల్..!

అఖిల్ హీరోగా విక్రం కుమార్ డైరక్షన్ లో వచ్చిన సినిమా హలో. నాగార్జున నిర్మాణంలో వచ్చిన ఈ సినిమా లాస్ట్ ఫ్రైడే రిలీజ్ అయ్యింది. సినిమా అంచనాలను అందుకోగా అఖిల్ తన కెరియర్ లో మొదటి హిట్ అందుకున్నాడు. తొలిరోజు మొదటి షో నుండి పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న అఖిల్ ఓవర్సీస్ లో సత్తా చాటుతున్నాడు. ఇప్పటికే అఖిల్ హలో హాఫ్ మిలియన్ మార్క్ అందుకుందని తెలుస్తుంది.

ఇక క్రిస్ మస్ సందర్భంగా అఖిల్ హలో సత్తా చాటాడు. ఈ సినిమా తొలి 3 రోజుల్లో 10 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయగా.. 7.7 కోట్ల షేర్ వసూలు చేయగా.. నాలుగవ రోజు కూడా అఖిల్ హలో 2 కోట్ల దాకా కలక్షన్స్ సాధించాడని తెలుస్తుంది. ఫైనల్ కలక్షన్స్ రిపోర్ట్ రావాల్సి ఉండగా మొత్తానికి అఖిల్ ఈ సినిమాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు.

సినిమా కథ కథనాల్లో దర్శకుడు ప్రతిభ చాటగా సినిమా క్లీన్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకులను అలరిస్తుంది. స్టైలిష్ లవ్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ హలో అఖిల్ కెరియర్ లో ఓ కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది.

Leave a comment