విజయ్ కి అప్పుడే అంత బలుపా ..?

ఒక సరికొత్త ప్రయోగంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎవరూ ఊహించని భారీ హిట్ అందుకున్న “అర్జున్ రెడ్డి ” సినిమాతో అందులో నటించిన విజయ్ దేవరకొండ కి ఎక్కడ లేని పేరు తీసుకురావడమే కాకుండా ఓకే స్టార్ స్టేటస్ తీసుకొచ్చింది. ఇక అప్పటి నుంచి వరుస ఆఫర్లతో బిజీ హీరోగా మారిపోయాడు. విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డిగా సరికొత్త బాడీ లాంగ్వేజ్ తో ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చెయ్యడంతో .. ఇప్పుడు అందరి దర్శకుల దృష్టిలో పడ్డాడు.

విజయ్ కోసం కొత్తగా కథలు తయారుచేసుకునే పనిలో పడ్డారు. యూత్ లో మంచి ఫాలోయింగ్ రావడంతో విజయ్ తో సినిమా తీసేందుకు నిర్మాతలు పోటీ పడుతున్నారు. కేవలం చిన్నా చితకా దర్శకులే కాదు ఎంతో పేరు మోసిన దర్శకులు కూడా ఈ అర్జున్ రెడ్డి కోసం కథలు సిద్ధం చేసుకుంటున్నారు.తమిళ్ టాప్ డైరెక్షర్ మణిరత్నం కూడా విజయ్ తో సినిమా చేసేందుకు సిద్దమయ్యాడట. అతనికి స్టోరీ వినిపించడం… దానికి విజయ్ ఒకే చెప్పడం చకచకా జరిగిపోయాయి.

గత కొంత కాలంగా స్టార్ డైరెక్టర్ మణిరత్నం ఒక మల్టీ స్టారర్ ని తెరకెక్కించడానికి ట్రై చేస్తున్నాడు. ఇప్పటికే శింబు – అరవింద్ స్వామి – విజయ్ సేతుపతి లను కథానాయకులుగా ఎంచుకున్నాడు. ఇక జ్యోతిక – ఐశ్వర్య రాజేశ్ – ఫాహద్ ఫాసిల్ వంటి వారు కూడా సినిమాలో నటించడానికి ఒకే చెప్పారు. మరొ ముఖ్యమైన పాత్రకు టాలీవుడ్ నుంచి ఒక హీరోను తీసుకోవాలని దర్శకుడు ఆలోచిస్తున్నాడు. అంతకుముందు నానిని కలిసినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా విజయ్ దేవరకొండకు మణిరత్నం కథను వినిపించడంతో ముందుగా ఒకే చెప్పాడని అయితే ఆ తర్వాత రెమ్యునరేషన్ విషయంలో నిర్మాతలకు విజయ్ కి మధ్య మాట కలవకపోవడంతో ఈ సినిమా చేసేందుకు విజయ్ నో చెప్పినట్టు తెలుస్తోంది.

Leave a comment