Gossipsమెగా స్టార్ తో గొడవా ..? అల్లు అరవింద్ షాకింగ్ కామెంట్స్...

మెగా స్టార్ తో గొడవా ..? అల్లు అరవింద్ షాకింగ్ కామెంట్స్…

బంధువులు ప్రాణ స్నేహితులుగా మారడం చాలా అరుదుగా చూస్తుంటాం. టాలీవుడ్ లో అలాంటి అనుబంధం ఉన్న ఇద్దరు లెజెండ్స్ కూడా ఉన్నారు వారే మెగా స్టార్ చిరంజీవి- అల్లు అరవింద్. ఒకరు లేకపోతే ఒకరు లేనంతగా వీరిద్దరి మధ్య అంత అనుబంధం ఉంది. సినిమాలు కుటుంబం రాజకీయం…ఇలా చిరుకు సంబంధించిన అన్ని విషయాలలో అల్లు అరవింద్ పాత్ర ఎంతో కీలకమైనది.

తమ ఇద్దరి మధ్య విభేదాలు వచ్చినట్లు పుకార్లు వచ్చాయని … అందులో ఏమాత్రం వాస్తవం లేదని అల్లు అరవింద్ చెప్పుకొచ్చారు. ఇటీవల ఓ మీడియా చానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అల్లు అరవింద్ అనేక ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. ఇండస్ట్రీలో అనేక సంవత్సరాల పాటు స్నేహాన్ని బంధుత్వాన్ని కంటిన్యూ చేసిన వారు చాలా తక్కువగా ఉన్నారన్నారు. బాపు-రమణ కృష్ణారెడ్డి-అచ్చిరెడ్డి చిరంజీవి-తాను ఆ కోవకు చెందుతామని చెప్పారు.

ప్రజారాజ్యం పార్టీ పెట్టిన తర్వాత ఇద్దరి మధ్య కొన్ని విబేధాలు వచ్చినా అవి చిన్న చిన్నవే అని అరవింద్ అన్నారు. కానీ అవేవీ మా బంధం పై ప్రభావం చూపలేదని తామిద్దరం ఎప్పటికీ మంచి స్నేహితులమని చెప్పారు. పీఆర్పీని కాంగ్రెస్ లో విలీనం చేయడంలో అరవింద్ కీలకమైన పాత్ర పోషించారని పవన్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో అరవింద్ ఈ ప్రస్తావన తీసుకురావడం రాజకీయంగా చర్చకు తెరలేపుతోంది

చిరంజీవి హీరోగా ఎదుగుతున్న రోజుల్లో ఆయన వెనుక నేను ఉన్నది నిజమే. కానీ కొన్ని చిన్న చిన్న బాధ్యతలు మాత్రమే చూసుకున్నాను. చిరు వెనుక నేను ఉన్నానని, కుటుంబ బాధ్యతలను చూసుకుంటానని నమ్మి.. నాకు ఆ బాధ్యతలను అప్పగించారు. చిరంజీవిగారికి నేనంటూ ఏదైనా చేశాను అంటే అది ఇదే అని అరవింద్ చెప్పారు. మేము ఒకరంటే ఒకరికి చాలా అభిమానమని, అందుకే మా మధ్య ఎటువంటి విబేధాలు తలెత్తకుండా స్నేహాన్ని కొనసాగిస్తున్నామని అరవింద్ చెప్పారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news