బాలయ్యా.. నీ స్పీడ్ ఆపలేమయ్యా !

ఒకవైపు రాజకీయాలు మరో వైపు వరుస సినిమాలతో బాలయ్య మంచి జోరు మీద ఉన్నాడు. రాజకీయాల్లో ప్రజాసేవలో నిమగ్నమవుతూనే .. మరో వైపు తీరక లేకుండా సినిమాలు చేసుకెళ్ళిపోతున్నాడు బాలయ్య. ఈ నేపధ్యంలో వరుస సినిమాలను చేస్తూ యంగ్ హీరోలకు షాక్ ఇస్తున్నాడు ఈ నందమూరి హీరో.

గౌతమీపుత్ర శాతకర్ణి’ సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన బాలయ్య ఆ తరువాత పూరీ దర్శకత్వంలో 101 మూవీగా వచ్చిన ‘పైసా వసూల్’లో నటించారు. ఈ సినిమా అనుకున్న స్థాయిలో హిట్ అవ్వకపోయినప్పటికీ .. తన 102వ సినిమాను మాత్రం కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో చేస్తున్నారు. ఈ సినిమా జై సింహాగా ప్రేక్షకుల ముందుకు సంక్రాంతి కానుకగా రాబోతోంది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. మళ్ళీ ఏమాత్రం గ్యాప్ తీసుకోకుండా … జనవరి నుంచి మళ్ళీ ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో మళ్ళీ ఓ సినిమా స్టార్ట్ చెయ్యడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు.

యమలీల.. ఘటోత్కచుడు తరహాలోనే ఈ సినిమా ఉండబోతోంది. ఫ్యాంటసీ సబ్జెక్టును తీసుకుని బాలకృష్ణను అప్రోచ్ కాగా.. ఎస్వీ కృష్ణారెడ్డి చెప్పిన సబ్జెక్టు బాలయ్యను ఆకట్టుకుందని తెలుస్తోంది. జనవరి నుంచి ఈ చిత్రం షూటింగ్ ప్రారంభించేద్దామని అన్నారట బాలయ్య. అంటే నెల రోజుల గ్యాప్ లోనే మరో సినిమా మొదలుపెట్టేస్తుండడం విశేషం. కృష్ణారెడ్డి చెప్పిన ఈ స్టోరీ బాగా నచ్చడంతో బాలయ్య వెంటనే ఈ ప్రాజెక్ట్ కి ఒకే చెప్పేశాడట. అసలు ఈ పాటికే బాలయ్య సినిమా తేజా డైరక్షన్ లో ఎన్టీఆర్ బయోపిక్ మొదలెట్టేయాల్సి ఉండగా అది ప్రస్తుతానికి వాయిదా పడినట్టు తెలుస్తోంది. ఒక సినిమా అయిన వెంటనే మరో సినిమా చేస్తూ బాలయ్య తీరిక లేకుండా ఉన్నాడు. బాలయ్య స్పీడ్ అందుకోవడం నిజంగా ఏ హీరోకి సాధ్యం కాదేమో !

Leave a comment