Gossipsఅల్లరి నరేష్ లావు అవ్వడానికి మహేషే కారణమా ..?

అల్లరి నరేష్ లావు అవ్వడానికి మహేషే కారణమా ..?

తెలుగు సినిమా ఇండ్రస్ట్రీలో ఇప్పుడు ఎక్కడ చూసినా మల్టీస్టార్ మూవీస్ ఎక్కువ అయిపోయాయి. చిన్న హీరో పెద్ద హీరో అనే బేధమే లేదు అందరూ అదే ట్రెండ్ ఫాలౌ అయిపోతున్నారు.ఇదే కోవలో ఇప్పుడు ప్రిన్స్ మహేష్ కూడా సిద్ధం అయిపోయాడు. అందుకే మ‌రో మ‌ల్టీ స్టార‌ర్‌తో వ‌స్తున్నాడు. అయితే, ఈ సారి వెండి తెరమీద నవ్వుల పువ్వులు పూయించే అల్లరి నరేష్ తో కలిసి మహేష్ సందడి చేయనున్నాడు. అయితే, ఈ సినిమా కోసం న‌రేష్ బ‌రువు పెర‌గాల్సి రావడంతో ఇప్పుడు ఆ పనిలో నరేష్ బిజీ అయిపోయినట్టు సమాచారం.

ఇటీవ‌ల ఓ కార్య‌క్ర‌మానికి హాజ‌రైన న‌రేష్ లావుగా కనిపించేసరికి అంతా షాక్ తిన్నారట. ఆ తరువాత ఆ విషయం గురించి తెలుసుకుని ఓహో అందుకా అంటూ కుదిటపడ్డారట. మహేష్ తో వంశీ పైడిపల్లి తీస్తున్న సినిమా కోసం నరేష్ ఇలా లావు అయ్యే పనిలో పడిపోయాడు.

మహేశ్ త్వ‌ర‌లో కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ‘భరత్‌ అనే నేను’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాలో మహేశ్‌ ముఖ్యమంత్రిగా క‌నిపించ‌నున్న ఈ సినిమాతో బాలీవుడ్‌ నటి కైరా అడ్వాణీ టాలీవుడ్ కు ప‌రిచ‌యం కానుంది. ఈ చిత్రం షూటింగ్ పూర్త‌యిన వెంట‌నే మ‌హేష్ – నరేష్ సినిమా మొదలయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. అయితే ఇందులో అల్లరి నరేష్ పాత్ర ఏంటనేది మాత్రం ఇంకా సస్పెన్స్ గానే ఉంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news