మ‌హేష్ – బ‌న్నీ గొడ‌వ‌… చ‌ర్చ‌లు ఫెయిల్‌..!

ఒకే రోజు రెండు యంగ్ హీరోల సినిమాలు విడుదల చేసేందుకు డేట్ లు ప్రకటించేయడంతో చిన్నపాటి వివాదమే ఇండ్రస్ట్రీలో నడుస్తోంది. యాదృచ్చికంగా జరిగిన పొరపాటుపై ఇరు సినిమాల నిర్మాతలు చర్చలు జరుపుకుంటున్నారు. అయితే ఆ చర్చల్లో కూడా ఏమీ తేలకపోవడంతో ఈ వివాదం ఇంకెన్ని రోజులు ఉంటుందో చెప్పలేము. బన్నీ హీరోగా నా పేరు సూర్య సినిమాకు ఎప్పుడో విడుదల డేట్ ప్రకటించారు. కానీ ఈ మధ్యనే అదే డేట్ కు తాము వస్తున్నట్లు మహేష్ హీరోగా భరత్ అనే నేను సినిమా నిర్మాత డివివి దానయ్య ప్రకటించారు. దీంతో తాము వెనక్కు తగ్గే సమస్యే లేదని, తాము ముందు డేట్ ప్రకటించామని, అందువల్ల ఏది ఏమైనా అదే డేట్ కు వస్తామని బన్నీ సినిమా యూనిట్ ప్రకటించేసింది.

దీంతో మహేష్ సినిమా నిర్మాత దానయ్య పరిస్థితి ఇబ్బందిలో పడింది. అదే రోజు సినిమా విడుదల చేస్తే అరవింద్ తో తంటా. భవిష్యత్ లో బన్నీతో సినిమా చేయాలన్నా ఇబ్బంది. లేదూ అలా అని వెనక్కు తగ్గితే, తన హీరో మహేష్ తో సమస్య. అలాగే ఇద్ద‌రు స్టార్ హీరోల సినిమాలు ఒకే రోజు విడుద‌లైతే థియేట‌ర్ల స‌మ‌స్య త‌లెత్తుతుంది. క‌లెక్ష‌న్ల‌ను కూడా పంచుకోవాల్సి వ‌స్తుంది. దీంతో మ‌హేష్ సినిమా నిర్మాత దాన‌య్య రాజీ చ‌ర్చ‌లు ప్రారంభించార‌ట‌.

కొద్దీ రోజుల క్రితం దానయ్య వెళ్లి, గీతా ఆఫీసులో బన్నీవాస్, నాగబాబులతో చర్చలు సాగించినట్లు తెలిసింది. ‘ఏప్రియల్ 27న బన్నీ సినిమా వుందన్న సంగతి తనకు గుర్తు లేదని, పొరపాటున డేట్ ప్రకటించానని, ఇప్పుడు ఏం చేద్దామన్నది మీరే చెప్పండని’ దానయ్య కోరినట్లు తెలుస్తోంది. దానికి గీతా వర్గాలు ‘తాము ఇప్పుడు వెనక్కు తగ్గితే రీజన్ అనేది లేకుండా తగ్గినట్లు అవుతుందని, చాలా సమస్యలు వస్తాయని, అదే దానయ్య తెలియకుండా డేట్ ప్రకటించారు కాబట్టి, తెలిసి సరిదిద్దుకున్నట్లు అవుతుందని’ వివరించినట్లు తెలుస్తోంది. ఆఖరికి మరో సారి కూర్చుందామని సమావేశం ముగించేశారంట.

Leave a comment