Gossipsరాంగోపాల్ వర్మ చేతిలో నాగ్....అసలు ఎం జరగబోతుంది?

రాంగోపాల్ వర్మ చేతిలో నాగ్….అసలు ఎం జరగబోతుంది?

శివ‌మ‌ణి త‌రువాత నాగ్ ఖాకీ యూనిఫాం వేసింది లేదు
నాకొంచెం మెంట‌ల్ అంటూ పూర్ణ మార్కెట్ ని హ‌డ‌లెత్తించాడుగా
ఇప్పుడు ఆర్జీవీతో చేసేసినిమాలోనూ ఆయ‌న మ‌రో మారు లాఠీ ప‌ట్టి ఠారెత్తించ‌నున్నారు.

వివ‌రాలిలా :: తెలుగు సినిమా కాన్వాస్ పై రాంగోపాల్ వర్మ-నాగార్జునల “శివ” సినిమా ఒక చెరగని సంతకం చేసింది. “శివ” విడుదలై 28 ఏళ్లవు తున్నా ఇప్ప టికీ ఆ సినిమా కొత్త దర్శకులకు ఓ నిఘంటువు. ఇంకా చెప్పాలంటే ఓ రిఫ‌రెన్స్ కోడ్‌. అలాంటి క్రేజీ కాంబినేషన్ మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత రిపీట్ కానుంది. రాంగోపాల్ వర్మ ఓ అద్భుతమైన కథ చెప్పాడని, త్వరలోనే సెట్స్ కు వెళ్లనుందని నాగార్జున స్వయంగా ఇటీవల “రాజు గారి గది 2” ప్రమోషన్స్ లో భాగంగా చెప్పిన విషయం తెలిసిందే.

రాంగోపాల్ వ‌ర్మే స్వయంగా నిర్మించనున్న ఇంకా టైటిల్ నిర్ణయించని ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ నవంబర్ 20 నుంచి మొదలు కానుంది. “శివ” సినిమా మొదటి షాట్ ను షూట్ చేసిన అన్నపూర్ణ స్టూడియోస్ లోనే తాజా చిత్రాన్ని కూడా ప్రారంభించనున్నారు. రాంగోపాల్ వర్మ “కంపెనీ” బ్యానర్ లో ఈ క్రేజీ మూవీని ప్రొడ్యూస్ చేయనున్నారు. ఆర్జీవీ చిరకాల మిత్రుడు సుధీర్ చంద్ర పడిరి ఈ చిత్రానికి సమర్పకునిగా వ్యవహరించను న్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news