Gossipsసైరాలో పవర్ స్టార్.. అబ్బో ఇక రికార్డుల మోతే..!

సైరాలో పవర్ స్టార్.. అబ్బో ఇక రికార్డుల మోతే..!

మెగాస్టార్ నటిస్తున్న సైరా నరసింహా రెడ్డి సినిమాలో ఇప్పటికే అమితాబ్, సుదీప్, జగపతి బాబు లాంటి స్టార్స్ నటిస్తుండగా ఇప్పుడు తమ్ముడు పవర్ స్టార్ ను ఆ సినిమాలో భాగమయ్యేలా ప్రయత్నాలు చేస్తున్నారట మెగా కాంపౌండ్. పవర్ స్టార్ ఉంటే ఆ సినిమాకు అదనపు ఆకర్షణ అవుతుందని ఈ నిర్ణయం తీసుకున్నారట.

కథలో ఓ 10 నిమిషాల పాత్ర కథను మలుపు తిప్పే పాత్ర ఉంటుందట ఆ పాత్ర కోసం ముందు వెంకటేష్ ను అనుకున్నారట కాని అది పవర్ స్టార్ చేసే అదిరిపోద్దని మెగా అభిమానులకు మంచి ఫీస్ట్ లా అవుతుందని సెట్ చేస్తున్నారట. సైరాలో పవర్ స్టార్ ఉండటం కన్ఫాం అయితే ఇక రికార్డుల సంచలనమే అని చెప్పొచ్చు. సురేందర్ రెడ్డి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా ఫైనల్ అయ్యింది.

ఏ.ఆర్.రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో మెగాస్టార్ లుక్ చాలా కొత్తగా ఉంటుందట. టెస్ట్ షూట్ ముగిసిన ఈ సినిమా డిసెంబర్ నుండి రెగ్యులర్ సెట్స్ మీదకు వెళ్లబోతుందట. 2019 సంక్రాంతి బరిలో సైరాని దించాలని మెగా కాంపౌండ్ నిర్ణయించుకుంది.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news