Moviesదీపికా – అనుష్క శర్మ బాటలోనే సన్నిలియోన్

దీపికా – అనుష్క శర్మ బాటలోనే సన్నిలియోన్

నేటి సినిమా స్టార్ లు మామూలోళ్లు కాదండి బాబు ! ఒకవైపు సినిమాలు చేస్తూ రెండు చేతులా బాగానే సంపాదిస్తున్నా. ఏమాత్రం తృప్తి చెందడంలేదు. స్టార్ ఇమేజ్ ఉండగానే అన్ని పనులు చక్కబెట్టేసుకుకోవాలని చుస్తునారు. ఓ వైపు సినిమాలను చేస్తూ మరో వైపు యాడ్స్ ని కూడా చేసేస్తూ నాలుగు రాళ్లు వెనకేసుకుంటున్నారు. ప్రస్తుతం సినిమాలకన్నా తారలు ఎక్కువగా యాడ్స్ తోనే సంపాదించేస్తున్నారు. దీంతో పాటు ఈ రెంటిలో బిజీగా ఉన్నా సరే ఏ మాత్రం వెనుకడుగు వేయకుండా వ్యాపారం లో కూడా అడుగుపెట్టి బిసినెస్ స్టార్లు గా మారుతున్నారు. ఇప్పుడు ఇదే కోవలో వ్యాపారం మొదలెట్టేసింది ఫోర్న్ క్వీన్ సన్నిలియోన్.

ఈ అమ్మడు ఎంత పాపులర్ అనేది అందరికి తెలుసు. అడల్ట్ ఇండస్ట్రీలో ఉన్నపుడే ఓ రేంజ్ లో యాడ్స్ చేసేది.  కానీ ఇప్పుడు అన్ని వర్గాలకు నచ్చేలా కొన్ని ప్రచారాలను కూడా చేసేస్తోంది.  రీసెంట్ గా సరికొత్తగా కొత్త వ్యాపారం మొదలుపెట్టింది. బట్టల వ్యాపారం మొదలు పెట్టి బిజినెస్ ని డెవలెప్ చేయడానికి చాలా కృషి చేస్తోంది. అర్చన కొచ్చార్ అనే ఫ్యాషన్ డిజైనర్ తో కలసి.. ‘గుడ్ గాళ్జ్.. బ్యాడ్ బాయ్స్’ అనే బ్రాండ్ ఓపెన్ చేసింది సన్నీ.  మీకు కావాలంటే ఈ బట్టలను ఆన్ లైన్ లో కొనుక్కోవచ్చు.

ఇంతకుముందు  దీపికా పదుకొనె – అనుష్క శర్మ అలాగే సోనమ్ కపూర్ లు కూడా ఇదే తరహాలో వ్యాపారం మొదలు పెట్టి సక్సెస్ అయ్యారు. ఇప్పుడు సన్నీ కూడా మొదలు పెట్టి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది. ఇక గతంలో సన్నీ లియోన్ పెర్ఫ్యూమ్ బిజినెస్ చేసింది.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news