వివాదాలతో సెట్స్ మీదకు వెళ్ళబోతున్న నాగ్

వివాదాల దర్శకుడు- టాలీవుడ్ మన్మధుడి కంబినేషన్లో ఓ సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్లే సూచనలు మెండుగా కనిపిస్తున్నాయి. రామ్‎గోపాల్ వర్మ ‘లక్మిస్ ఎన్టీఆర్’ సినిమా మొదలుపెట్టే కంటే ముందే అక్కినేని నాగార్జునతో ఓ సినిమా చేస్తానని గతంలోనే ప్రకటించాడు.

చాలా కాలం తర్వాత వర్మ-నాగ్ కాంబోలో సినిమా అనేసరికి టాలీవుడ్ వర్గాల్లోనూ ఈ సినిమాపై ఆత్రుత మొదలైంది. దీనికి తెరదించుతూ ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందనే విషయాన్ని తాజాగా దర్శకుడు వర్మ సోషల్ మీడియా వేదికగా బహిరంగంగా ప్రకటించాడు.

నవంబర్ 20వ తేదీన ఉదయం 10.30 గంటలకు ముహూర్తం ఖరారు చేశామని, అన్నపూర్ణ స్టూడియోస్ లో ముహూర్తపు షాట్ ఉంటుందని ప్రకటిస్తూ నాగార్జునతో దిగిన ఓ ఫోటోను షేర్ చేశాడు వర్మ. ‘నా మొదటి సినిమా ‘శివ’ ఓపెనింగ్.. నా తండ్రి మరియు అక్కినేని నాగేశ్వర్ రావు చేతులమీదుగా జరిగిందని.. ఇప్పుడు ఈ సినిమాను మా అమ్మ మరియు నా మొదటి నిర్మాతలు అక్కినేని వెంకట్, యార్లగడ్డ ప్రసాద్‎ల చేతులమీదుగా ప్రారంభించబోతున్నా’ అని టాగ్ చేస్తూ ప్రతీ మూడు దశాబ్దాలకోసారి తాను భావోద్వేగాలకు గురవుతానని ఈ సందర్బంగా తెలిపాడు వర్మ. వర్మ నాగ్ ల కాంబినేషన్ అంటే మరో శివ లాంటి సంచలనం చూడవచ్చేమో !

 

Leave a comment