కొత్త ప్రయోగాలు చేస్తున్న రవితేజ..

ప్ర‌యోగాలంటేనే భ‌య‌ప‌డిపోతున్నాడు మాస్ మ‌హారాజ‌..ఇటీవ‌ల విడుద‌లైన రాజా ది గ్రేట్ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో..మ‌రికొన్ని కొత్త చిత్రా లు చేసేందుకు సై అంటున్నాడు..అవ‌న్నీ కామెడీ ఎంట‌ర్ టైన‌ర్లే కావ‌డం విశేషం.ప్ర‌స్తుతం ఈయ‌న స్క్రీన్ ప్లే రైట‌ర్ విక్ర‌మ్ సిరితో ట‌చ్ చేసి చూడు సిని మా చేస్తున్నాడు..త్వ‌ర‌లోనే త‌న పాత మిత్రుడు శ్రీ‌నువైట్ల‌తో క‌లిసి నాలుగోసారి (నీకోసం, వెంకీ, దుబాయ్ శ్రీ‌ను) ప‌నిచేయ‌నున్నాడు. అదేవిధంగా పారితోష‌కం విష‌యంలో ఎక్క‌డా త‌గ్గేది లేద‌ని తేల్చేస్తున్నాడు.త‌న నుంచి ప్రేక్ష‌కులు వినోదాన్ని కోరుకుంటార‌ని, ఆ త‌ర‌హా క‌థ‌ల‌నే సిద్ధం చేయా ల‌ని డైరెక్ట‌ర్ల‌కు సూచిస్తున్నాడు.కొత్త ఏడాదిలో మ‌రికొన్ని చిత్రాల‌ను ఫైన‌ల్ చేయ‌నున్నాడ‌ని స‌మాచారం.

Leave a comment