Gossipsహీరోలంటే రకూల్ కి అంత మంటా ...?

హీరోలంటే రకూల్ కి అంత మంటా …?

నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు ఎంచుకుంటూ జాగర్తగా అడుగులు వేస్తుంది. అటు నటనని ఇటు గ్లామర్ ని కావలసినంత వాడుతూ ఆడియన్స్ కి దగ్గరయింది రకుల్ ప్రీత్ .తన గ్లామర్ సీక్రెట్ ఫిట్నెస్ అంటూ హైదరాబాద్ లో జిమ్ కూడా పెట్టేసింది. ఇప్పుడు పారితోషకాల మీద తన అభిప్రాయాలను గడుసుగా చెప్పేస్తుంది ఈ జిమ్ భామ .

పారితోషకాల మీద మీ అభిప్రాయం ఏంటని రకుల్ ని ప్రశ్నిస్తే .. తాను తన కష్టానికి తగ్గట్లు పారితోషకం అందుకుంటున్నానని చెబుతూనే.. హీరోలతో పోలిస్తే హీరోయిన్లకు దక్కుతున్నది చాలా తక్కువ మొత్తమే అని ఆమె వాపోతోంది.

హీరోయిన్లు ఎంత స్టార్ ఇమేజ్ సంపాదించినప్పటికీ పారితోషకం విషయంలో మాత్రం పెద్దగా మార్పు  లేదని రకుల్ అభిప్రాయపడింది. తమిళ హీరోయిన్ నయనతార సౌత్ ఇండియాలో లేడీ సూపర్ స్టార్ అనిపించుకుందని కానీ ఆమె పారితోషకం రూ.3 కోట్లు మించలేదని.. అదే దక్షిణాదిన చాలామంది స్టార్ హీరోలకు రూ.15 కోట్లు.. అంత కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ అందుతోందని రకుల్ చెప్పుకొస్తోంది.

ఈ వివక్ష పోవాలని , హీరోయిన్లకు కూడా పారితోషకం పెరగాలని రకుల్ డిమాండ్ చేస్తోంది. ఐతే తాను మాత్రం ఈ పోలికల గురించి ఎక్కువ ఆలోచించకుడా తన కష్టానికి తగ్గట్లు పారితోషకం అందుకుంటున్నానా లేదా అన్నదే చూస్తున్నానని.. తనకు దక్కుతున్న దాంతో సంతృప్తి చెందుతున్నానని గడుసు సమాధానం చెప్తోంది. అంటే ఆ అమ్మడికి అందుతున్న పారితోషకం సరిపోవడం లేదన్నా ఆ మీనింగ్ ..?

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news