Gossipsతిరపతిలో ప్రభుదేవా పెళ్లి ! పెళ్లికూతురు ఎవరంటే..?

తిరపతిలో ప్రభుదేవా పెళ్లి ! పెళ్లికూతురు ఎవరంటే..?

ప్రపంచానికి మైఖేల్ జాక్సన్ ఎలాగో ఇండియాకి ప్రభుదేవా అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అందుకే ఆయన్ని ఇండియన్ మైఖేల్ జాక్సన్ అంటారు. అలాంటి ప్రభుదేవా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ప్రభుదేవా త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్నాడు. అదేంటి నయనతారతో బ్రేక్ అప్ చెప్పేసిన తర్వాత నయనతార దర్శకుడు విఘ్నేశ్‌ శివతో ప్రేమలో పడి ఇద్దరూ సహజీవనం చేస్తున్నారనే ప్రచారం కూడా చాలా కాలంగానే జరుగుతోంది. అయితే ప్రభుదేవా మాత్రం ఒంటరిగానే జీవిస్తున్నారు. తాజాగా నిక్కీగల్రాణితో పెళ్లికి సిద్ధం అయ్యారనే ప్రచారం జోరందుకుంది.

ఈ పెళ్లి పుణ్యక్షేత్రమైన తిరుపతిలో జరగనుంది. చాలాకాలంగా ప్రేమలో ఉన్న ప్రభుదేవా, నిక్కీగల్రాణిల పెళ్లి తిరుపతిలో బంధుమిత్రుల సమక్షంలో జరగనున్నట్లు సమాచారం. అయితే ఈ పెళ్లి నిజమైన పెళ్లి కాదు సినిమాకోసం వీరు ఇద్దరు ఒకటి కాబోతున్నారు.

ఇంతకు ముందు ప్రభు, ప్రభుదేవా కలిసి నటించిన చార్లీచాప్లిన్‌కు స్వీకెల్‌గా ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాలో నిక్కీగల్రాణి, ఆదాశర్మ హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. అమ్మా క్రియేషన్స్‌పై టి. శివ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అమ్నేశ్‌ సంగీతం అందిస్తుండగా శక్తి చిదంబరం దర్శకుడు. చార్లీచాప్లిన్‌-2 సినిమాలో భాగమే ఇప్పుడు తిరుపతిలో ప్లాన్ చేసిన హీరో హీరోయిన్ల పెళ్లి తంతు. తిరుపతి వెళ్లి వచ్చే మార్గంలో జరిగే సంఘటనే సినిమాకు మూలం అందుకోసమనే ఈ విధంగా ప్లాన్ చేసినట్టు దర్శకుడు చెప్పుకొచ్చాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news