Gossipsనంద‌మూరి – మెగా మ‌ల్టీస్టార‌ర్… రెండు గుడ్ న్యూస్‌లు

నంద‌మూరి – మెగా మ‌ల్టీస్టార‌ర్… రెండు గుడ్ న్యూస్‌లు

కొద్దిరోజుల క్రితం దర్శక బాహుబలి రాజమౌళి, ఎన్టీఆర్, చెర్రీ కలిసి ఉన్న ఫోటోని సోషల్ మీడియాలోకి విడుదల చేసి పెద్ద సంచలనమే సృష్టించాడు జక్కన్న. ఈ ఫోటో మీద  ఎన్నో  పుకార్లు, ఎన్నో  గాసిప్స్ కూడా బయలుదేరాయి.  ఆఖరికి సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ కూడా స్పందించి వివాదాస్పద ట్విట్ కుడా చేసాడు. అయితే ఆ ఫోటో వెనుక ఏదో ఉంది అనే అనుమానం అయితే అందరిని సస్పెన్స్ కి గురి చేసింది. కానీ దానిమీద అప్పుడు ఎవరూ క్లారిటీ ఇవ్వలేదు. కానీ ఇప్పుడు ఆ ముగ్గురి కాంబినేషన్ లో మల్టీ స్టార్  సినిమా వస్తోంది. దానికి టైటిల్ కూడా పెట్టేసారు అని చెప్పుకుంటున్నారు సినీ జనాలు.

అయితే అలాంటి సినిమా అంటూ వస్తే అప్పుడు ఆ చిత్రానికి ‘యమధీర’ అనే టైటిల్‌ పెట్టే అవకాశాలు ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. సోషల్‌మీడియాలో నెటిజన్లు కూడా ఈ టైటిల్‌ అయితేనే బాగుంటుందంటూ తెగ ట్వీట్లు పెట్టేస్తున్నారు. రాజమౌళి చరణ్‌తో తెరకెక్కించిన ‘మగధీర’ చిత్రంలోని ధీర, తారక్‌తో తీసిన ‘యమదొంగ’ చిత్రంలోని ‘యమ’ పదాలను కలిపి ఈ టైటిల్‌ను ట్రెండింగ్‌లోకి తీసుకొచ్చారు. అయితే ఈ టైటిల్‌కు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

‘జై లవకుశ’ విజయంతో జోరుమీదున్న ఎన్టీఆర్‌.. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కబోయే చిత్రం కోసం సిద్ధమవుతున్నారు. మరోపక్క రామ్‌చరణ్‌.. సుకుమార్‌ దర్శకత్వంలో వస్తున్న ‘రంగస్థలం 1985’ చిత్రంతో బిజీగా ఉన్నారు. సమంత కథానాయిక. చరణ్‌ పాత్ర, ఆయన ఆహార్యం విభిన్నంగా ఉంటాయని సమాచారం. ఇప్పటికే కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. వేసవి కానుకగా మార్చిలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news