మరో వివాదంలో బాలకృష్ణ-రవితేజ..

టాలీవుడ్ లో వరుస విజయాలతో దూసుకుపోతున్న హీరోస్ లో ఒకరు బాలకృష్ణ మరొకరు మాస్ మహారాజ్ రవితేజ వెరీ ఇరువురి మధ్య ప‌దేళ్ల క్రితం ఓ హీరోయిన్ విష‌యంలో గొడ‌వ జ‌రిగింద‌న్న పుకారు ఉంది. అప్పట్లో ఆ ఇష్యూ చాలా పెద్ద‌ది అవ్వ‌డంతో అప్ప‌ట్లో ఇండ‌స్ట్రీ పెద్ద‌ల‌కు కొంద‌రు జోక్యం చేసుకున్న‌ట్టు కూడా గుస‌గుస‌లు ఉన్నాయి.ఆ ఇష్యూ త‌ర్వాత ర‌వితేజ కావాల‌నే బాల‌య్య‌కు పోటీగా త‌న సినిమాలు రిలీజ్ చేయిస్తున్నాడ‌న్న టాక్ కూడా ఇండ‌స్ట్రీలో ఉంది.

2008లో ఒక్క‌మ‌గాడు, కృష్ణ సినిమాలు ఒకేసారి సంక్రాంతికి వ‌చ్చాయి.అప్పుడు కృష్ణ సినిమా హిట్ అయ్యింది. ఆ త‌ర్వాత 2011లో కూడా బాల‌య్య ప‌ర‌మ‌వీర‌చ‌క్ర, ర‌వితేజ మిర‌ప‌కాయ్ ఒకేసారి వ‌చ్చాయి. అప్పుడు కూడా ర‌వితేజ మిర‌పకాయ్ సినిమాయే హిట్ కొట్టింది. ఇక ఇప్పుడు వ‌చ్చే సంక్రాంతికి కూడా ర‌వితేజ కావాల‌నే త‌న సినిమాను బాల‌య్య సినిమాకు పోటీగా రిలీజ్ చేస్తున్నాడ‌న్న ప్ర‌చారం జ‌రుగుతోంది.
మాస్ మ‌హ‌రాజ్ ర‌వితేజ రాజా ది గ్రేట్ సినిమా స‌క్సెస్ అవ్వ‌డంతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చేశాడు. రెండేళ్ల త‌ర్వాత వ‌చ్చి హిట్‌కొట్టిన ర‌వితేజ సంక్రాంతికి త‌న లేటెస్ట్ మూవీ ట‌చ్ చేసి చూడు సినిమాతో థియేట‌ర్ల‌లోకి దిగుతున్నాడు. వాస్త‌వానికి బాల‌య్య లేటెస్ట్ మూవీ జై సింహాను సంక్రాంతికి రిలీజ్ చేస్తున్న‌ట్టు ఎప్పుడో ప్ర‌క‌టించారు. ప‌వ‌న్ అజ్ఞాత‌వాసి కూడా సంక్రాంతికే వ‌స్తోంది.

అయితే ర‌వితేజ సినిమా ఇప్ప‌టికిప్పుడు సంక్రాంతి రేసులోకి వ‌చ్చేసింది. దీంతో ర‌వితేజ కావాల‌నే త‌న సినిమాను సంక్రాంతి బ‌రిలో దింపుతున్నాడ‌ని ఇండ‌స్ట్రీ ఇన్న‌ర్ టాక్‌. మ‌రి ఈసారి బాల‌య్య వ‌ర్సెస్ ర‌వితేజ పోరులో ఎవ‌రు పైచేయి సాధిస్తారో ? చూడాలి.

Leave a comment