రెజీనాతో ఎఫైర్ పై నారా రోహిత్ స్పందన..!

మెగా హీరో సాయిధరమ్ తేజ్‌తో రెజీనా పెళ్లి జరుగబోతున్నదనే వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. తాజాగా నారా రోహిత్‌తో రెజీనా అఫైర్ సాగుతున్నదనే వార్త సంచలనంగా మారింది. అందాల తార రెజీనా కసాండ్రాతో అఫైర్ వార్తలు మీడియాలో ఇటీవల బాగానే వినిపిస్తున్నాయి. ఇటీవలే ఈ ముద్ద్దుగుమ్మ తన అందాలను ఆరబోస్తూ ఫోటోషూట్ కూడా తీయించుకుని నేను ఎక్సపోజింగ్ కి కూడా సిద్దమే అని ప్రకటించింది.

రెజీనాతో లవ్ అఫైర్ నడుస్తోంది అని వస్తున్న వార్తలపై నారా రోహిత్ తాజాగా స్పందించారు. రెజీనాతో అఫైర్ అని వస్తున్న వార్తలు నా దృష్టి వరకు వచ్చాయి. ఈ వార్తల్లో వాస్తవం లేదు. నేనేమీ సీరియస్‌గా తీసుకోవడం లేదు ఇండ్రస్ట్రీలో ఇటువంటివి అన్ని కామన్ అంటూ కొట్టిపారేశాడు.

గతంలో రెజీనాతో శంకర, జో అచ్యుతానంద చిత్రాల్లో నటించా. ప్రస్తుతం బాలకృష్ణుడు సినిమాల్లో కలిసి నటిస్తున్నాను. మొదటి సినిమా నుంచి ఈ గాసిప్ వినిపిస్తున్నది అని రోహిత్ చెప్పుకొస్తున్నాడు. తరుచుగా మేమిద్దరం కలిసి నటిస్తున్నాం. రూమర్, గాసిప్స్ వైరల్ కావడానికి ఇది కూడా ఒక కారణం అయి ఉంటుంది. మేము ప్రొఫెషనల్ రిలేషన్ షిప్ షేర్ చేసుకున్నాం. అది తప్ప మా మధ్య మరో విషయం లేదు అని రోహిత్ చెప్తున్నాడు.

Leave a comment