అదిరింది తెలుగు సెన్సార్ లైన్ క్లియర్..

తమిళ ఇండస్ట్రీలో దీపావళి పండుగ సందర్భంగా హీరో విజయ్ నటించిన మెర్సల్ ఎన్నో సంచలనాలు సృష్టించింది. ఓ వైపు డాక్లర్లు మరోవైపు రాజకీయ నాయకులు ఈ సినిమాపై ఎన్నో రాద్దాంతాలు చేశారు. అయితే సినిమా మాత్రం అంచనాలకు మించి విజయం సాధించడమే కాకుండా విజయ్ కెరీర్ లో అత్యధిక వసూళ్లు చేసిన చిత్రంగా మిగిలిపోయింది.

ఈ చిత్రం తెలుగు వెర్షన్ అదిరింది ఆ మద్య రిలీజ్ చేస్తామన్నారు కానీ.. కేంద్రం తెచ్చిన జీఎస్టీ పన్ను విధానం మీద విమర్శలు ఉండటంతో సినిమాను నిలిపివేశారు. ఇవాళ్టికి సెన్సార్ పెద్దలు శాంతించి ఆ సినిమా రిలీజ్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ యూ/ఎ సర్టిఫికేట్ మంజూరు చేశారు. దీంతో ఈ సినిమా ఈనెల తొమ్మిదో తేదీన రిలీజ్ చేసేందుకు చిత్ర నిర్మాతలు సిద్ధమవుతున్నారు.

శరత్ మరార్ తెలుగులో రిలీజ్ చేస్తున్న ఈ సినిమా తెలుగులో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. సమంత, కాజల్, నిత్యా మీనన్ ముగ్గురు క్రేజీ హీరోయిన్స్ నటించిన ఈ సినిమా ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Leave a comment