ఆ మెగా హీరో తో మ‌హేష్‌బాబు మ‌ల్టీస్టార‌ర్‌…

ఎప్పుడూ ఒకేలా ఉంటే కిక్ ఏముంటుంది అని అనుకుంటున్నారో ఏమో గాని ఇప్పుడు మన తెలుగు హీరోలందరు క్రమక్రమంగా ట్రెండ్ మారుస్తున్నారు. అందుకే తెలుగులో ఈ మధ్య కాలంలో మల్టీ స్టార్ సినిమాలు ఎక్కువయ్యాయి. వెంకటేష్ – పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో గోపాల గోపాల సినిమా కూడా వచ్చింది. అలాగే ఫామిలీ లుక్ హీరోలు మహేష్ , వెంకటేష్ కాంబినేషన్ లో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అనే సూపర్ హిట్ సినిమా కూడా వచ్చింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ మధ్యకాలంలో ఈ ట్రెండ్ బాగానే నడుస్తోంది.

తాజాగా మిల్క్ బాయ్ మహేష్, మెగా హీరో సాయి ధరమ్ తేజ కంబినేషన్ లో ఓ మల్టీ స్టార్ సినిమా రాబోతుందన్న వార్త ఫిలింనగర్ లో షికారు చేస్తోంది. ఇటీవల దిల్ రాజు మనవడు అర్చిత్ పుట్టిన రోజు సందర్భంగా గ్రాండ్ సెలబ్రేషన్స్ జరిగాయి. ఈ కార్యక్రమానికి మహేష్ – తేజు – కళ్యాణ్ రామ్ వంటి హీరోలు అటెండ్ అయ్యారు. అలాగే దిల్ రాజు క్యాంప్ నకు చెందిన వంశీ పైడిపల్లి.. హరీష్ శంకర్ కూడా అర్చిత్ ను ఆశీర్వదించేందుకు వచ్చారు. ఓ సమయంలో వంశీ మాట్లాడుతూ.. మల్టీస్టారర్ ప్రస్తావనను కదిపాడు. మెగా మేనల్లుడితో మల్టీస్టారర్ లో నటిస్తారా అంటూ మహేష్ బాబును వంశీ పైడిపల్లి అడగగా.. ‘మీరు కథ తీసుకురండి.. నేను ఎందుకు చెయ్యను చెప్పండి’ అనేశాడట మహేష్.

దీనిపై రియాక్ట్ అయిన సాయి ధరం తేజ్ ‘నేను కూడా రెడీ అన్నా’ అంటూ ప్రకటించేశాడట. ప్రస్తుతానికి ఇది పిచ్చాపాటీ కబుర్లతో ఓకే అనుకున్నా.. ఓ మల్టీస్టారర్ మూవీకి బీజం పడినట్లే అనే టాక్ వినిపిస్తోంది. ఈ వార్త తెలిసిన ఇరువురి అభిమానులు ఊరికే ఉంటారా ..? ఇట్స్ ఏ క్రేజీ క్రేజీ కాంబినేషన్ అంటూ పాటలు పాడేసుకుని ఆనందంతో ఊగిపోతున్నారు. అయినా మిల్క్ బాయ్- మెగా హీరో కాబినేషన్ అంటే ఆ కిక్కే వేరు.

Leave a comment