Gossipsజక్కన్న కొత్త సినిమా న్యూస్ బయటకొచ్చిందోచ్ !

జక్కన్న కొత్త సినిమా న్యూస్ బయటకొచ్చిందోచ్ !

అతను అందరిలాంటి వాడు కాదు ఏది చేసినా డిఫరెంట్ గా చెయ్యడమే అతని స్టయిల్. అందుకే ఇప్పటివరకు ఆయన్ని అపజయమే పలకరించలేదు. ఆయన సినిమాలో చెయ్యాలంటే స్టార్ హీరోనే కానక్కర్లేదు.చిన్న హీరో , కమెడియన్ ఆఖరికి ఈగ ను పెట్టి సినిమా తీసినా అది హిట్ అవ్వాల్సిందే ..! ఎందుకంటే ఆయన రాజమౌళి అలియాస్ జక్కన్న కాబట్టి.

అపజయం ఎరుగని తెలుగు సినిమా దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రాజమౌళి బాహుబలి తరువాత ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అగ్ర శ్రేణి నిర్మాతల లిస్టులో ఆయన చేరిపోయాడు. బాహుబలి సినిమా తర్వాత రాజమౌళి ఎలాంటి సినిమా చేయబోతున్నారు, ఎలాంటి కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని ఇప్పుడు సినీ జనాలు ఎదురుచూసే పరిస్థితి వచ్చేసింది. తెలుగు సినిమాకు అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతిని తీసుకు వచ్చాడు. అందుకే రాజమౌళి తర్వాత సినిమా కోసం అంతా ఎదురు చూస్తున్నారు.

బాహుబలి 2 చిత్రం విడుదలై నెలలు గడిచి పోతున్నా.. ఇంకా జక్కన్న సినిమాను ప్రకటించక పోవడం అందరికి నిరాశను కలిగిస్తుంది. ఇప్పటి వరకు అధికారిక ప్రకటన ఏమీ రాలేదు. కాని తాజాగా ఒక చిన్న లీక్‌ ద్వారా రాజమౌళి సినిమా గురించి ఒక వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
దానయ్య బ్యానర్‌లో రాజమౌళి సినిమాను చేయబోతున్న విషయం తెల్సిందే. దానయ్య నుండి అనధికారికంగా సినిమా గురించిన అప్‌డేట్స్‌ లీక్‌ అయ్యాయి.

ఇటీవలే దానయ్య సన్నిహితుల వద్ద సినిమా గురించి మాట్లాడుతు ప్రస్తుతం రాజమౌళి మరియు విజయేంద్ర ప్రసాద్‌లు ఇద్దరు కలిసి కథను ఫైనల్‌ చేసే పనిలో ఉన్నారని, త్వరలోనే కథ ఫైనల్‌ అవుతుందని చెప్పుకొచ్చాడు. కథ ఫైనల్‌ అయిన తర్వాత నటీనటుల ఎంపిక చేస్తారని, జనవరిలో సినిమాకు సంబంధించిన ప్రకటన వచ్చే అవకాశం ఉందని ఆయన సన్నిహితుల దగ్గర వ్యాఖ్యానించిన గుసగుసలు బయటకి పొక్కాయి. జక్కన్న సినిమా అంటేనే భారీ బడ్జెట్ కదా ఈ సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో అన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news