Moviesహలో రేట్లు చుక్కలంటుతున్నాయ్..!

హలో రేట్లు చుక్కలంటుతున్నాయ్..!

అక్కినేని నట వారసుడు అఖిల్ హీరోగా విక్రం కుమార్ డైరక్షన్ లో వస్తున్న సినిమా హలో. డిసెంబర్ 22న రిలీజ్ అవనున్న ఈ సినిమా టీజర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. అన్నపూర్ణ బ్యానర్లో నాగార్జున నిర్మిస్తున్న ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతుంది. ఇక ఈ సినిమా టీజర్ కు వచ్చిన పాజిటివ్ రెస్పాన్స్ చూసుకుని నాగార్జున ఈ సినిమా బిజినెస్ ను భారీగా చెబుతున్నాడట.
దాదాపు ఓ స్టార్ రేంజ్ సినిమా రేటుని థియేట్రికల్ రైట్స్ శాటిలైట్ రైట్స్ చెబుతున్నాడట. ప్రస్తుతం చర్చలు నడుస్తున్నట్టు తెలుస్తుంది. అఖిల్ ఫ్లాప్ ఛాయలు ఈ సినిమా మీద పడకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్న నాగార్జున అఖిల్ రీ లాంచింగ్ మూవీ అంటూ హలో గురించి ప్రమోట్ చేస్తున్నాడట. కళ్యాణి ప్రియదర్శిని హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్నారు.
చుక్కలంటుతున్న హలో రేట్లను చూసి డిస్ట్రిబ్యూటర్స్ అంతా భయపడుతున్నారు. అఖిల్ కూడా ఇదే రేంజ్ లో బిజినెస్ చేయగా ఫైనల్ రిజల్ట్ మాత్రం తేడా కొట్టేసింది. నాగార్జున సొంత బ్యానర్ లో సినిమా కాబట్టి కచ్చితంగా వర్క్ అవుట్ అవుతుందని చెప్పొచ్చు
మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news