త్రివిక్రమ్‌ను హర్ట్‌ చేసిన దేవిశ్రీ, అందుకే..!

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌, దేవిశ్రీ ప్రసాద్‌ కాంబినేషన్‌లో వచ్చిన దాదాపు అన్ని సినిమాలు కూడా మ్యూజికల్‌ హిట్‌ అయ్యాయి. ప్రతి సినిమాలో కూడా దేవిశ్రీ ప్రసాద్‌ పాటలు ప్రేక్షకుల ఆధరణ పొందాయి. అందుకే దేవిశ్రీ ప్రసాద్‌ను తన సినిమాలకు వరుసగా కంటిన్యూ చేశాడు. అయితే తాజాగా పవన్‌తో తెరకెక్కించిన అజ్ఞాతవాసి ఆ తర్వాత ఎన్టీఆర్‌తో చేయబోతున్న సినిమాకు తమిళ సంగీత దర్శకుడు అనిరుధ్‌ను ఎంపిక చేయడం జరిగింది.

ఈ విషయం గురించి మొన్నటి వరకు ఎలాంటి ప్రచారం జరగలేదు. దేవిశ్రీ ప్రసాద్‌ను ఎందుకు త్రివిక్రమ్‌ తప్పించాడు అనే విషయాన్ని ఎవరు పట్టించుకోలేదు. కాని తాజాగా ఒక ఆసక్తికర వార్త ఒకటి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌, నితిన్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కిన అఆకు దేవిని తీసుకోవాల్సి ఉంది ఆ సినిమా టైం లోనే ఇద్దరికీ విభేదాలు వచ్చాయట.

తాను ఆశించిన స్థాయిలో దేవిశ్రీ ట్యూన్స్‌ ఇవ్వక పోవడంతో త్రివిక్రమ్‌ పలు సార్లు నిరుత్సాహం వ్యక్తం చేశాడు. దాంతో దేవిశ్రీ ప్రసాద్‌ ట్యూన్స్‌ను ఆలస్యం చేయడం, చేయమన్నట్లుగా చేయకుండా తనకు ఇష్టం వచ్చినట్లుగా చేయడం చేశాడట. దాంతో పాటు సినిమా విడుదల సమయం దగ్గర పడుతున్నా కూడా దేవిశ్రీ ఆర్‌ఆర్‌ పూర్తి చేయకుండా త్రివిక్రమ్‌కు చిరాకు తెప్పించాడట. ఆ కారణాల వల్ల త్రివిక్రమ్‌ హర్ట్‌ అయ్యాడని, అందుకే తన తదుపరి సినిమాలకు దేవిశ్రీని తీసుకోవడం లేదని సమాచారం. వీరిద్దరి మద్య విభేదాలు ఇలాగే కొనసాగుతాయా లేక ఎవరైనా వీరిని కలుపుతారా అనేది చూడాలి.

 

Leave a comment