Gossipsచెర్రీ కొరటాల సినిమా ఆగిపోయిందా ..?

చెర్రీ కొరటాల సినిమా ఆగిపోయిందా ..?

మెగా హీరో రాంచరణ్ , క్రియాటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ‘రంగస్థలం 1985’ సినిమా చేస్తున్నాడు. షూటింగ్ పరంగా ఈ సినిమా చివరిదశకు చేరుకుంది. వేసవికి ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు.

ఈ సినిమా తరువాత కొరటాల శివతో చరణ్ ఒక సినిమా చేయనున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ చరణ్ తన తదుపరి సినిమాను బోయపాటి శ్రీనుతో చేయబోతున్నట్లు తన సన్నిహితుల దగ్గర చెర్రీ అన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.

దీనికి సంబంధించిన స్క్రిప్ట్ పనుల్లోనే బోయపాటి బిజీగా ఉన్నాడనీ, వచ్చేనెలలో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కవచ్చని తెలుస్తోంది. దీంతో కొరటాల శివతో చెర్రీ చేయాలనుకున్న ప్రాజెక్టు ఆగిపోయిందా? లేదా వాయిదా పడిందా? అనే విషయంలో క్లారిటీ లేకుండా పోయింది.

అసలు ‘మిర్చి’ తరువాతనే చరణ్ తో కొరటాల ఓ సినిమా చేయవలసి వుంది. స్క్రిప్ట్ విషయంలో చరణ్ అసంతృప్తి కారణంగా ఆ ప్రాజెక్టు ఆగిపోయిందని చెప్పుకున్నారు.

అసలు చరణ్ సుకుమార్ సినిమా కన్నా ముందే రామ్ చరణ్, కొరటాల శివల కాంబినేషన్ లో సినిమా చర్చ ప్రారంభమైంది. అయితే ఆ సినిమాను పక్కన పెట్టేసిన చరణ్, సుకుమార్ ప్రాజెక్ట్ రంగస్థలం 1985ను స్టార్ట్ చేశాడు, కొరటాల మహేష్ తో ‘భరత్ అనే నేను’ మొదలు పెట్టాడు.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news