Moviesఎన్టీఆర్‌కు ఈ కుర్ర హీరోయిన్ ఇలా షాకిచ్చిందేంటి..

ఎన్టీఆర్‌కు ఈ కుర్ర హీరోయిన్ ఇలా షాకిచ్చిందేంటి..

తెలుగు ఇండ్రస్ట్రీలో ఇప్పుడిప్పుడే ఓనమాలు దిద్దుతూ మంచి హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంటున్న సమయంలో ఓ యంగ్ హీరో అందునా మంచి టాప్ రేంజ్ లో ఉన్న హీరో పక్కన ఛాన్స్ వస్తే ఎవరన్నా ఏమి చేస్తారు ..? ఎగిరి గంతేస్తారు. కానీ ఆ ఆఫర్ తిరస్కరించి టాక్ ఆఫ్ ది ఇండ్రస్ట్రీగా మారిపోయింది ఓ కేరళా కుట్టి.

మంచి పేరున్న పెద్ద బ్యానర్ పై తెరకెక్కబోతోన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కబోతున్న ఓ సినిమాలో హీరోయిన్ గా మలయాళీ కుట్టి అనుపమా పరమేశ్వరన్ ని సంప్రదించగా ఆమె రిజెక్ట్ చేసిందంట దీంతో ఒక్కసారిగా అంతా షాక్ కి గురయ్యారు. శతమానం భవతితో బ్లాక్ బస్టర్ సాధించిన దర్శకుడు సతీష్ వేగేశ్న. ఇప్పుడీ దర్శకుడు దిల్ రాజు బ్యానర్ లోనే శ్రీనివాస కళ్యాణం అంటూ మరో కుటుంబ కథా చిత్రం తీయడానికి రెడీ అయిపోయాడు.

ఈ సినిమాలో ఓ హీరోయిన్ ఛాన్స్ ను అనుపమకు ఆఫర్ చేశారట. కానీ ఈ పాత్రను దృష్టిలో ఉంచుకుని.. ఆ కేరక్టర్ తాను చేయలేనని తేల్చేసిందట ఈ భామ. ఈ కేరక్టర్ సినిమా సగానికి చనిపోయే పాత్ర కావడంతో ఆ పాత్రకు నో చెప్పిందంట అనుపమ. ఆ పాత్ర చనిపోతుందనే కారణంతో.. కేరక్టర్ మొనాటనీ వస్తుందనే ఉద్దేశ్యంతో.. యంగ్ టైగర్ మూవీనే కాదని చెప్పడం మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. హీరో.. బ్యానర్ మాత్రమే కాదు.. తనకు కేరక్టర్ కూడా ముఖ్యమే అని అనుపమా నిరూపిస్తోంది .

ఇప్పటికే ఉన్నది ఒకటే జిందగీ చిత్రంలో ఇలాంటి పాత్రనే చేసిన ఈమె మరుసటి చిత్రంలో కూడా చనిపోయే పాత్రను చేయలేనని తేల్చి చెప్పేసిందట . సినిమాకు కీలకం అయినా సరే.. ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్నా.. ఈ పాత్రకు ససేమిరా అని ఒప్పుకోలేదు ఆమె.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news