నా సెక్సీ పోస్టర్ గురించి ఇంత చర్చ అవసరమా : అమలాపాల్ 

వివాదాల‌కు కేరాఫ్ అడ్రెస్‌గా నిలిచే అమలాపాల్. అవకాశాలు అంతగా లేని స‌మ‌యంలోనే పెళ్లి పీట‌లు ఎక్కేసింది ఈ మూడుగుమ్మ.  ఆ పెళ్లి తంతును కూడా అంతే స్పీడ్ గా కట్ చేసేసుకుని ఆ తంతుని కాస్తా తొందరగానే ముగించేసింది. భ‌ర్త‌తో విడాకులు తీసుకున్న విష‌యాన్ని స్వ‌యంగా తానే వెల్ల‌డించేసి షాక్ ఇచ్చేసింది. అంతేనా మ‌గాళ్లు మాత్ర‌మే విడాకులు తీసుకోవాలా?  మేమేం త‌క్కువ తిన్నామా అన్నట్లు సంచలనాలు సృష్టించేసింది.
పెళ్లయ్యాక కూడా సినిమాలు చేసిన ఈ సుందరి హోమ్లీగానే కనిపిస్తూ వచ్చింది. కానీ విడాకులు అయిపోయాక మాత్రం తానేంటో చూపించేసింది. అంటే గ్లామర్ డోస్ పెంచేసింది అన్నమాట. తన అందాల ఆరబోత ద్వారా మళ్ళీ కెరియర్ ని గాడిలో పెట్టాలని చూస్తోంది. అందుకే ఫొటో షూట్లు చేసినా సినిమాల్లో అయినా హాట్ హాట్ గా కనిపిస్తూ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.
 ఆమె కథానాయికగా నటించిన కొత్త సినిమా ‘తిరుట్టుపయలె-2’కు సంబంధించి ఒక ఫొటో అయితే పెద్ద చర్చకు దారితీసింది. హీరో బాబీ సింహాతో కలిసి ఆమె ఇచ్చిన సెక్సీ పోజు కుర్రాళ్ల మతులు పోగొట్టేస్తుంది. అందులో నడుం అందాల్ని చూపిస్తూ  ప్రియులను గిలిగింతలు పెట్టింది. ఐతే ఈ పోస్టర్ చూసి విమర్శించిన వాళ్లూ లేకపోలేదు.
DM31VhoUEAA4vep download
ఐతే తాను నడుం అందాల్ని ఎక్స్ పోజ్ చేసిన పోస్టర్ గురించి జరుగుతున్న చర్చ విషయమై అమలా పాల్ ఆశ్చర్యపోయింది. మనం ఉన్నది 2017లో ఈ పోస్టర్ గురించి అంత చర్చ అవసరమా అని ఆమె ప్రశ్నించింది. ఈ సినిమాలో తాను బోల్డ్ అండ్ కాన్ఫిడెంట్ ఉమన్ క్యారెక్టర్ చేస్తున్నానని,  దానికి తగ్గట్లే పోస్టర్ డిజైన్ చేశారని,  దాని గురించి ఇంత రచ్చ అనవసరమని ఇలాంటి వాటిని తేలిగ్గా తీసుకోవాలని ఆమె చెప్తుండడం చూస్తుంటే ఇంకా ఈ అమ్మడు ఏ స్థాయిలో తన అందచందాలను ఆరబోస్తుందో చూడాలి. ‘తిరుట్టు పయలె’ సినిమాలో అమలాపాల్ అందాల ఆరబోత చూడాలంటే  ఈ నెల ౩౦ వరకు ఆగాల్సిందే.

Leave a comment