Moviesకొరటాల శివతో అల్లు అర్జున్.. బన్ని ఫ్యాన్స్ కు పండుగే..!

కొరటాల శివతో అల్లు అర్జున్.. బన్ని ఫ్యాన్స్ కు పండుగే..!

టాలీవుడ్ లో ప్రస్తుతం క్రేజీ కాంబినేషన్స్ సెట్ అవుతున్నాయి. రాజమౌళి ఓ పక్క చరణ్, ఎన్.టి.ఆర్ లతో మల్టీస్టారర్ ప్లాన్ చేయగా మరో పక్క కొరటాల శివతో స్టైలిష్ స్టార్ మూవీ షురూ చేస్తున్నాడట. ప్రస్తుతం వక్కంతం వంశీ డైరక్షన్ లో నా పేరు సూర్య సినిమా చేస్తున్న అల్లు అర్జున్ ఆ సినిమా తర్వాత అసలైతే తమిళ దర్శకుడు లింగుసామితో సినిమా ఫిక్స్ చేశాడు.

కాని ప్రస్తుతం కొరటాల శివతో సినిమా ప్లాన్ చేస్తున్నాడట రచయితగా ఉన్న కొరటాల శివ దర్శకుడిగా మారి చేసిన మూడు సినిమాలు సూపర్ హిట్లు సాధించాయి. అప్పటి వరకు ఆ హీరోల హయ్యెస్ట్ కలెక్షన్స్ సినిమాలు ఏవున్నా సరే కొరటాల శివ సినిమాతో బ్లాక్ బస్టర్ అయ్యేలా చేసుకున్నాడు. అందుకే కొరటాల శివ తో సినిమా అంటే హీరోలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

ఇక కొరటాల శివతో బన్ని కాంబో సెట్ అయితే మెగా ఫ్యాన్స్ పండుగ చేసుకోవచ్చు. కొరటాల శివ మహేష్ తో చేస్తున్న భరత్ అను నేను సినిమా పూర్తి కాగానే ఈ సినిమా పట్టేలెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news