ప్రభాస్ కి నో చెప్పిన హీరోయిన్ ! 

బాహుబలితో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రభాస్ కు ఉన్న  క్రేజ్ అంతా ఇంతా కాదు.  ఆయన అమ్మయిల కలల  రాకుమారుడిగా పేరుపొందాడు. అసలు ఆయన పక్కన హెరాయిన్ గా నటించే ఛాన్స్ వస్తే ఎవరన్నా ఎగిరి గంతు వస్తారు.  అయితే  అందుకు భిన్నంగా ఆయన పక్కన నటించే అవకాశం ఒక హీరోయిన్ కి వస్తే సో సారి అని  చెప్పేసిందట ! దీంతో షాక్ తిన్నారట  ప్రభాస్ సాహో యూనిట్.
బాహుబలి తర్వాత ప్రభాస్ చేస్తోన్న ‘సాహో’ సినిమాలో నటించేందుకు బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ అని చెప్పుకొంటున్నారు. సాహోలో నా పాత్ర లెంగ్త్ బాగాలేదని ఆమె రిజక్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఈ విషయం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
‘సాహో’ కోసం ముందుగా అనుష్కని తీసుకుందామని అనుకున్నా  ప్రభాస్-అనుష్క జంట రొటీన్ అవుతుందని.. ఆమె స్థానంలో బాలీవుడ్ హీరోయిన్ ని తీసుకోవాలని నిర్ణయించారు. దీంతో అలియా భట్ ని సంప్రదిస్తే ఆమె షాకిచ్చిందట. ఆ తర్వాత ఆ ఆఫర్ శ్రద్దా కపూర్ కి వెళ్లడం ఆమె ఓకే చేయడం  చాకచక జరిగిపోయాయి. ఇప్పటికే సాహో ఫస్ట్ షెడ్యూల్ పూర్తయ్యింది. ప్రస్తుతం రెండో షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది.

Leave a comment