అనుష్క – విరాట్ ల పెళ్లి ఫిక్స్ …! డేట్ ఎప్పుడో తెలుసా ..?

ఇండియన్ క్రికెట్ టీం కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ ల ప్రేమ వ్యవహారం అందరికి తెలిసిన విషయమే. వీళ్ళ మధ్య రిలేషన్ చాల సంవత్సరాల నుండి వున్నా 4 ఏళ్ళ క్రితం ఇంగ్లాండ్ టూర్ తో వీరి వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

అయితే లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే డిసెంబర్‌లో వీళ్లిద్దరి మ్యారేజ్ దాదాపుగా ఖరారైనట్టు ఇన్‌సైడ్ సమాచారం. ఐతే, పెళ్లి ఏ తేదీన అనేది స్పష్టత రావాల్సివుంది. డేట్ ఎప్పుడైతే బాగుంటుంది అన్నదానిపై పేరెంట్స్ తర్జనభర్జన పడుతున్నారు.

కోహ్లీ ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్న సమయంలో అనుష్క బహిరంగంగా కోహ్లీ కి మద్దతు తెలిపింది. ఇటీవల వీళ్లిద్దరు కలిసి ఓ యాడ్ ఫిల్మ్‌లో నటించారు కూడా. ముద్దుగా పిలుచుకునే ‘విరుష్క’ వివాహం వార్తతో అభిమానులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. మరోవైపు డిసెంబరులోనే శ్రీలంకతో టెస్ట్, వన్డే సిరీస్‌లు ఉండడంతో కోహ్లి ఈ సిరీస్‌కు అందుబాటులో ఉంటాడా? లేదా? అనేది సస్పెన్స్‌గా మారింది.

Leave a comment