సమ్మర్ కి ఆ మూడు పెద్ద సినిమాలు రిలీజ్ కి రెడీ..!

summer clash between tollywood biggies

రెండు తెలుగు రాష్ట్రాలలో  సమ్మర్ హాలిడేస్ కి బెస్ట్ సోర్స్ అఫ్ ఎంటర్టైన్మెంట్ సినిమా ఒక్కటే. అందుకే టాలీవుడ్ లో కూడా  చాల సినిమాలు సమ్మర్ కి రిలీజ్ అయ్యేట్టు ప్లాన్ చేస్తారు. మొన్న సమ్మర్ లో బాహుబలి 2 రిలీస్ అయ్యి సంచలనాలు సృష్టించిన సంగతి తెలిసిందే.

2018 సమ్మర్ కి కూడా చాల సినిమాలు ప్లాన్ చేస్తున్నారు టాలీవుడ్ బిగ్గిస్. రామ్ చరణ్ నూతన చిత్రం రంగ స్థలం 1985 చిత్రం టాకీ పార్ట్ జరుగుతుంది. ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ కావాల్సి వుంది, అయితే కొన్ని అనివార్య కారణాల వాళ్ళ సినిమా డిలే అయ్యి సమ్మర్ కి పోస్ట్ ఫోన్ అయ్యిందట. ఏప్రిల్ 13 న చిత్రం రిలీజ్ డేట్ లాక్ చేశారట చరణ్.ఇక మహేష్ కొరటాల శివ  దర్శకత్వంలో చేస్తున్న ‘భరత్ అను నేను’ సినిమా కూడా సంక్రాంతి కి రిలీజ్ చెయ్యాలని మొదట్లో అనుకున్న, అదీ పోస్ట్ పోనే అయ్యి ఏప్రిల్ 27 రిలీజ్ డేట్  కంఫర్మ్ చేసారు చిత్ర యూనిట్.

అల్లుఅర్జున్ కచ్చితంగా ప్రతి వేసవికి ఒక సినిమా రిలీజ్ అయ్యేట్టు ప్లాన్ చేస్తారు.  ఎప్పటిలాగే బన్నీ  కూడా నెక్స్ట్ సమ్మర్ కి ‘నా పేరు సూర్య – నా ఇల్లు ఇండియా’ గా ప్రేక్షకులముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా మొదట ఏప్రిల్ 27న రిలీజ్ చేయాలనీ చిత్ర యూనిట్ అనుకున్న, మహేష్ కోసం 2 వారలు వెనక్కి వెళ్లి మే 10న రిలీజ్ చేయనున్నారు.

ఇంకా చాల సినిమాలు ఈ వేసవిలో మనకు వినోదాన్ని పంచడానికి సిద్దమవుతున్న ఈ మూడు చిత్రాలు మాత్రం మంచి ఓపెనింగ్స్ రాబట్టే అవకాశం కనబడుతుంది.

Leave a comment