ఆ ఒక్క సన్నివేశం పై దుమారం…

ట్రైల‌ర్ అదిరింది

సినిమా ఇంకా రాలేదు

తెలుగులో మెర్స‌ల్ ఇంకెప్పుడు విడుద‌ల అవుతుందో

అన్న స‌స్పెన్స్ కొన‌సాగుతూనే ఉంది.

ఈలోగా మ‌రో న్యూస్ ఈ సినిమాలో కొన్ని డైలాగ్స్‌కి బీప్ ఉంచాల‌న్న‌ది సెన్సార్  బోర్డ్ చెబుతున్న మాట‌!

వివ‌రాలిలా :: తమిళంలో విడుదలైన ‘మెర్సెల్‌’ రాజకీయంగా దూమారం రేపుతోంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన జీఎస్‌టీని విమర్శిస్తూ డైలాగ్‌లు ఉండటంతో విజ‌య్ ని టార్గెట్ గా చేసుకుని కొత్త కొత్త వివాదాలు సృష్టించింది బీజేపీ. ప్రభుత్వ తీరును తప్పుపడుతూ సినిమాలో డైలాగ్‌లు ఉండడ‌మే ఓ పెద్ద నేర‌మైన‌ట్లు ఆయా నేత‌లు ప్ర‌వ‌ర్తించి సినిమాకు ఎక్క‌డ లేని క్రేజ్ తీసుకువ‌చ్చారు.ఆఖ‌రికి ఆయా సన్నివేశాలు తొలగించాలని డిమాండ్‌ చేశారు.ఈ నేపథ్యంలో తెలుగులో సెన్సార్‌ పూర్తి కావడానికి ఆలస్యమైంది. జీఎస్‌టీపై ఉన్న డైలాగ్‌లు వచ్చే సమయంలో బీప్‌ సౌండ్‌ పెట్టాలా? వద్దా? అన్నదానిపై చర్చ జరుగుతోంది. దీంతో సినిమా శుక్ర‌వారం విడ‌ద‌ల కాద‌ని తేల్చేసింది నార్త్ స్టార్ ఎంట‌ర్ టైన్ మెంట్ . మ‌ళ్లీ ఎప్పుడు విడుద‌ల చేస్తామో  అన్న‌ది తామే వెల్ల‌డిస్తామ‌ని చెబుతోంది.

 

Leave a comment