నాగ్ కోసం నిండా మునిగిపోయిన సమంత

అక్కినేని స‌మంత

ఈ పేరు ఇప్పుడు గ‌త కొద్ది రోజులుగా న్యూస్ హ‌బ్‌లో ఉంటోంది
కుర్ర‌కారే కాదు అన్ని త‌రాలూ ఈమె గురించే మాట్లాడుతున్నాయి
రాజు గారి గ‌ది 2 స‌క్సెస్ అందుకు కార‌ణం
ఈ సినిమాలో ఆమె న‌ట‌న అభినంద‌నీయ స్థాయిలో ఉండ‌డం మ‌రో కార‌ణం
ఇంకో కార‌ణం గ‌త చిత్రాల‌కు భిన్నంగా ఆమె ఈ చిత్రంలో క‌నిపించ‌డం
ఇలా స‌మంత పేరు టాలీవుడ్ మార్మోగిపోతోంది.
న‌టిగా త‌న రేంజ్ పెంచే సినిమాలే ఇక‌నుంచి చేస్తాన‌ని అంటోంది.
ఇక రాజుగారి గ‌ది 2 న‌టించేందుకు ఆమెకు ఎంత చెల్లించారంటే.. వాస్త‌వానికి సమంత ఒక్కో సినిమాకు కోటి పదిహేను లక్షల వరకు పారితోషికం డిమాండ్ చేస్తుంటుంది. ఆమె సినిమాలకు సక్సెస్ రేట్ ఎక్కువగా ఉండడంతో స్టార్ హీరోలు కూడా ఆమెనే ప్రిఫర్ చేస్తుంటారు.రీసెంట్‌గా ఆమె నటించిన ‘రాజు గారి గది2’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా విజయం వెనుక సమంత కీలక పాత్ర పోషించింది. అయితే ఈ సినిమాకు ఆమె తన రెమ్యూనరేషన్‌ను సగానికి సగం తగ్గించి తీసుకుందని సమాచారం. కేవలం తన పాత్ర నచ్చడం మాత్రమే ఇందుకు కారణం కాదట. తన మామగారు నాగార్జునతో కలిసి నటించే అవకాశం రావడంతో ఆ ఛాన్స్‌ను మిస్ చేసుకోకూడదని తక్కువ రెమ్యూనరేషన్‌కు అంగీకరించిందని సమాచారం. అయితే ఆ పారితోషికం కూడా సినిమా విడుదలై హిట్ టాక్ వచ్చిన తరువాతే సమంతకు అందించారని తెలుస్తోంది.
ఇక వీరి రిస్పెప్ష‌న్ ఫంక్ష‌న్‌కు సంబంధించి కూడా మ‌రో వార్త వ‌చ్చింది. నాగ చైత‌న్య మామ సురేశ్ బాబు నేతృత్వాన త్వ‌ర‌లో ఓ చిన్న రిసెప్ష‌న్ ఫంక్ష‌న్ హైద్రాబాద్‌లో ఆయ‌న ఇంటిలోనే జ‌ర‌గ‌నుంద‌ట‌! చై త‌ల్లి ల‌క్ష్మీ కోరిక మేర‌కు ఈ వేడుక చేయనున్నారు.అత్యంత ఆత్మీయుల న‌డుమే ఈ ఫంక్ష‌న్ చేయ‌నున్నార‌ని స‌మాచారం.

Leave a comment