సమంతలాగానే మరో స్టార్ ఫ్యామిలికి కోడలు కాబోతున్న రెజీనా

సుధీర్ బాబు హీరోగ నటించిన SMS సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది చెన్నయ్ సుందరి రెజినా . తోలి చిత్రం తోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది రెజీనా . ఆ తర్వాత తెలుగులో వరసగా అవకాశాలు అందుకుంది . ఇక పిల్ల నువ్వు లేని జీవితం చిత్రం లో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ సరసన నటించింది . ఆ తరవాత సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమాలోనూ ఈ మెగా యువ హీరోతో జతకట్టింది రెజీనా .

అయితే ఇలా వరుస చిత్రాల్లో కలిసి  నటించడంతో అప్పట్లో రెజినా తో సాయి ధరమ్ తేజ్ లవ్ లో పడ్డాడన్న వార్త టాలీవుడ్ సర్కిల్ లో హాట్ టాపిక్ గ మారింది . తాజాగా ఇక ఇప్పుడు వీరిద్దరూ పెళ్లిచేసుకుంటున్నారన్న వార్త హల్చల్ చేస్తుంది . ఇద్దరి కంబినేషన్లో వరుస సినిమాలు వచ్చినప్పుడే వీరు ప్రేమలో ఉన్నారన్న వార్తలు వచ్చాయి. అప్పుడు అదంతా పుకారు మాత్రమేనని ఇద్దరు ఖండించారు.

అయితే నిజంగానే వీరిద్దరూ ప్రేమలో పడ్డారని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారనే వార్తే ఇప్పుడు మల్లి బయటకు రావడం విశేషం . ఇక ఈ విషయం లో తన తల్లి తండ్రులను ఒప్పించే పనిలో సాయి ధరమ్ తేజ్ ఉన్నారని అంటున్నారు . అయితే రెజీనా మాత్రం కెరీర్ పీక్ లో ఉన్నకారణంగా కొంత కాలం ఆగితే బావుంటుందని అంటుందట . సాయి ధరమ్ తేజ్ వచ్చే ఏడాది పెళ్లి చేసుకొనే ఆలోచనలో వున్నాడని అంటున్నారు. మరి ఈ ప్రచారం లో నిజం ఎంతో తెలియదు కానీ కొందరు మాత్రం సమంతలాగానే రెజీనా కూడా పెద్ద స్టార్ ఫ్యామిలీ కి కోడలు కాబోతుందని చెబుతుండడం విశేషం.