Gossipsరోబో-2.0 ని ముందుండి నడిపిస్తున్న రానా

రోబో-2.0 ని ముందుండి నడిపిస్తున్న రానా

వ‌రుస మూడు చిత్రాలు విజ‌యం సాధించాయి
ఘాజీ.. బాహుబ‌లి 2.. నేనే రాజు నేనే మంత్రి
ఇలా బాక్సాఫీసుకు అన్నీ బొనాంజాలే
అంతేకాకుండా ఓ టెలివిజ‌న్ షోకి యాంక‌ర్ గా కూడా చేసి పేరు తెచ్చుకున్నాడు.
ఇలా విభిన్న పంథాని ఎంచుకుని త‌న‌దైన మార్కు క‌న‌బ‌రుస్తూ ప్ర‌త్యేక‌త‌ని చాటుకుంటున్నాడు.
తాజాగా ఓ రానా రజ‌నీ క‌లిసి ఓ సినిమా చేయ‌బోతున్నారు.ఇలా చెప్ప‌డం క‌రెక్ట్ కాదు కానీ
మ‌రోలా చెప్పుకుంటే వివ‌రం ఇది చ‌ద‌వండిక‌..

బాహుబలితో జాతీయస్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్న రానా, ఇప్పుడు ర‌జ‌నీ న‌టించిన 2.ఓ చిత్ర ఆడియో వేడుక‌కి యాంక‌ర్ గా వ్య‌వ‌హ‌రించ‌నున్నాడు.దుబాయ్ లో శుక్ర‌వారం జ‌ర‌గ‌నున్న ఈ వేడుక‌కు అనేకానేక ప్ర‌త్యేకత‌లున్నాయి.బాహుబ‌లితో ఎంతో పేరు సంపాదించు కున్న రానా ఇటీవ‌లే నేనే రాజు నేనే మంత్రితో హిట్ కొట్టాడు.ప్రస్తుతం రానా ‘1945’ అనే పిరియాడికల్ మూవీలో నటిస్తున్నాడు. రెజీనా కథానాయిక. సత్యరాజ్‌, నాజర్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. యువన్‌ శంకర్‌రాజా స్వరాలు సమకూరుస్తున్నాడు. కాగా ఐఫా అవార్డ్స్‌- 2017 వేడుక‌లోనూ వ్యాఖ్యాతగా నానితో కలిసి ఆయన చేసిన సందడి అందరినీ కట్టిపడేసిన సంగ‌తి తెలిసిందే!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news