Gossipsప‌వ‌నిజం గురించి రాంగోపాల్ వర్మ వివాదాస్పద వాక్యాలు?

ప‌వ‌నిజం గురించి రాంగోపాల్ వర్మ వివాదాస్పద వాక్యాలు?

వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ మ‌రోసారి సంచ‌ల‌నానికి తెర‌తీశారు. జ‌న‌సేనాని ప‌వ‌న్ పై ఈ సారి ఆస‌క్తిదాయ‌క వ్యాఖ్య‌లు చేశారు.ప‌వ‌న్ లో నిజాయితీ త‌న‌కు ఎంత‌గానో న‌చ్చుతుంద‌ని, త‌న‌కు ప‌వ‌న్ రాసిన ఇజం పుస్తకం నిరాశ‌ప‌ర్చింది అంటూనే, మ‌రికొన్ని ఆసక్తిదాయ‌క విష‌యాలు ఉటంకించారు. ‘‘ఇజం’ పుస్తకం చదివాక నేను పవన్‌ కల్యాణ్‌కు బహిరంగంగా రాయాలనుకున్న లేఖ ఇది. పవన్‌.. ఇజం గురించి మాట్లాడేముందు మీకో విషయం చెప్పాలి. పార్టీ పెట్టాలన్న మీ ఐడియా నాకు చాలా నచ్చింది.
మీలో ఎప్పుడూ నచ్చేది మీ నిజాయతీనే. అంతేకాదు మీరు జనసేన పార్టీ పెట్టిన తర్వాత మొదటిసారి ఇచ్చిన ప్రసంగం కూడా చాలా నచ్చింది.’‘మీరు ‘ఇజం’ అనే పుస్తకాన్ని రాశారని తెలియ‌గానే నాలో ఏదో తెలియ‌ని ఉత్సుకత. చిన్నప్పటి నుంచి విపరీతంగా పుస్తకాలు చదివే అలవాటు ఉండడంతో మీ పుస్తకం కూడా చదివాను. మీరు పుస్తకంలో ప్రస్తావించినఅంశాలు, భావాలను చదివాక నాకు ఒక్కటే అర్థమైంది.
ఆ పుస్తకంలో ఉన్నదానికంటే ఎక్కువ జ్ఞానం మీలో ఉంది. అదీ కాకుండా మిమ్మల్నిచాలా అంశాలు తప్పుదోవ పట్టిస్తున్నాయి’‘ఇప్పుడు సమాజానికి కావాల్సింది 100 శాతం పవనిజం. బ్రూస్లీ గొప్ప మార్షల్‌ ఆర్టిస్టే కాదు గొప్ప దార్శనికుడు కూడా. ఆయన ఎప్పుడూ చెప్తుండేవాడు జ్ఞానం అనేది పైకి ఎక్కడానికి ఉపయోగించే నిచ్చెనలా ఉండాలి అని. మనం ఎక్కిన మెట్టును వదిలి మరో మెట్టు ఎక్కుతూ ఉండాలి. అంతేకానీ మనం ఎక్కిన మెట్లన్నీ పోగేస్తే మరింత పైకి వెళ్లలేం. మనల్ని ముందుకు నడిపించేదాన్ని మనం నడిపించకూడదు.’‘ పవన్‌.. నేను ఇక్కడ బ్రూస్లీ గురించి ఎందుకు ప్రస్తావించానంటే..అతని స్టైల్‌ విభిన్నమైనది. ఎందుకంటే అతను మరొకరిని చూసి నేర్చుకోవడానికి ఇష్టపడేవాడు కాదు.
మనమేం ఆలోచించాలన్నా ఏం చెప్పాలన్నా అది మన స్టైల్లోనే ఉండాలి. మీ శ్రేయోభిలాషిగా మిమ్మల్ని ఒక్కటే వేడుకొంటున్నాను. చెడు విషయాలు, ఆలోచనలు మిమ్మల్ని ప్రభావితం చేయకుండా చూసుకోండి. ఆఖరిగా ఒక్కమాట. మీరు రాసిన ‘ఇజం’ పుస్తకం నన్ను నిరాశపరిచింది. కానీ నాకు పవనిజంపై నమ్మకం ఉంది’ అని పోస్ట్‌లో పేర్కొన్నారు వర్మ.ఇక దీనిపై ప‌వ‌న్ అభిమానులు ఏ విధంగా స్పందిస్తారో చూడాలిక‌. ఇజం క‌న్నా ప‌వ‌నిజ‌మే మేలు చేస్తుంది అన్న‌ది రామూ చెప్ప‌క‌నే చెప్పిన మాట‌!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news