కాలా రిలీజ్ డేట్ ఫిక్స్.. ఇక రికార్డులు షురూనే..!

సూపర్ స్టార్ రజిని పా.రంజిత్ డైరక్షన్ లో వచ్చిన కబాలి సంచలనాలు తెలిసిందే. టీజర్ తోనే ప్రపంచ రికార్డులను సైతం నెలకొల్పిన కబాలి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాలా. రజిని అల్లుడు ధనుష్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రజిని మళ్లీ డాన్ గా కనిపిస్తున్నాడు. ఇక ఈ సినిమా ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయాలని చూస్తున్నారు.

ప్రస్తుతం నటిస్తున్న రోబో సీక్వల్ మూవీ 2.0 జనవరి 25న వస్తుండగా ఆ సినిమాకు సరిగ్గా మూడు నెలలు గ్యాప్ ఇచ్చి రజిని కాలాగా రాబోతున్నాడు. టైటిల్ పోస్టర్ లో కబాలిలానే స్టైలిష్ గా ఉన్నాడు రజిని. సినిమా రేంజ్ ను పెంచే ప్రమోషనల్ యాక్టివిటీస్ లో పా.రంజిత్ దిట్ట కబాలి టీజర్ ట్రైలర్ కటింగ్స్ చూస్తే ఆ విషయం అర్ధమవుతుంది. అయితే సినిమా కూడా అదే రేంజ్ లో ఉండేలా చూసుకుంటే బెటర్.

కబాలితో మిస్ అయిన రికార్డులను కాలాతో క్లియర్ చేయాలని చూస్తున్నారు రజినికాంత్. 2.0తోనే సంచలనాలు సృష్టిస్తాడు అనుకుంటే ఆ వెంటనే వచ్చే కాలా కూడా ఆ రికార్డులను కొనసాగిస్తుందని చెప్పొచ్చు.

Leave a comment