‘తీరని కోరిక ఒకటి ఉంది. ఏం జరుగుతుందోచూడాలి’…ర‌జ‌నీ రాక ఎప్పుడు ?

 

నేనొచ్చాన‌ని చెప్పు.. తిరిగొచ్చాన‌ని
ఈ పంచ్ డైలాగ్ గుర్తుందా ర‌జ‌నీ చెప్పిన ఈ డైలాగ్ ఎంత పాపుల‌రో మీకు తెల్సు క‌దా!!
అంత‌కుమించి అంటూ ఆయ‌న చేసిన హ‌డావుడి మ‌న‌కు గుర్తుందిగా..
మంచిది అని క‌బాలీ విసిరిన హాట్ బైట్ ఒక‌టి తెల్సుగా..
ఇక నిన్న మొన్న‌టి 2.ఓ ఆడియో వేడుక‌లో రజనీ మాట్లాడుతూ.. ‘తీరని కోరిక ఒకటి ఉంది. ఏం జరుగుతుందోచూడాలి.’ అని వ్యాఖ్యానించినట్లు చిత్రవర్గాల సమాచారం. అయితే ఈ వ్యాఖ్య‌ల అంత‌రార్థం తెలియ‌డం లేదు. బ‌హుశా రాజ‌కీయ అరంగేట్రం గురించి కావ‌చ్చు. ఆ మ‌ధ్య కమల్‌ హాసన్‌ పార్టీ పెడుతున్న నేపథ్యంలోనూ రజనీ ఓ వేదిక‌పై త‌న‌దైన శైలిలో స్పందించారు. రాజకీయాల్లోకి రావాలంటే పేరు, హోదా ఉంటే చాలదని అంతకంటే ఎక్కువే అర్హతలు ఉండాలని అన్నారు.అలానే ప్ర‌కాశ్ రాజ్ కూడా ఎవ‌రికి వారు త‌మ‌ని తాము నాయ‌కులు అనుకోవ‌డం త‌గ‌ద‌ని, అది జ‌నం అనుకోవాల‌ని వ్యాఖ్యానించాడు. ఇక మ‌రో ఆస‌క్తిదాయ‌క విష‌యం ఏంటంటే ర‌జ‌నీ తాజా చిత్రం విడుద‌ల సైతం వాయిదా ప‌డే అవ‌కాశం ఉంద‌ని, జ‌నవ‌రిలో కాక ఏప్రిల్ లో విడుద‌ల‌య్యే అవ‌కాశం ఉంద‌న్న‌ది ఓ రూమ‌ర్‌. ట్రైల‌ర్ రిలీజ్ ఫంక్ష‌న్ మాత్రం నవంబర్‌లో హైదరాబాద్‌లో చేయనున్నారని తెలుస్తోంది.

Leave a comment