‘రాజా ది గ్రేట్’ సినిమా పుణ్యమా అని జనం ఇబంధులు

‘రాజా ది గ్రేట్’ సినిమా పుణ్యమా అని ఓ వ్యక్తి ఇబ్బంది పడుతున్నాడు.ఫోన్ ఆన్ చేయాలంటేనే భ‌య‌ప‌డుతున్నాడు.ఇందుకు కార‌ణం ఈ సిని మాలో ప్ర‌స్తావించిన నంబ‌రే! క‌థానుసారం ఒక చోట హీరో తల్లి రాధిక విలన్ కు తన కొడుకు ఫోన్ నంబర్ చెబుతుంది.ఇది రవితేజ ఒరిజినల్ నంబరే అనుకుని జనాలు అదే పనిగా ఆ నంబ‌ర్ కు కాల్స్ చేసి విసిగిస్తున్నారు.

విశాఖపట్నం జిల్లా ఆనందపురం ప్రాంతానికి చెందిన గోపి అనే వ్యక్తికి ఎదు ర‌వుతున్న చేదు అనుభ‌వం ఇది.అతడికి రవితేజ ఫ్యాన్స్ అదే పనిగా ఫోన్ చేసి ఇరిటేట్ చేస్తున్నారు.‘రాజా ది గ్రేట్’ సక్సెస్ అయినందుకు త‌న‌కు వ‌రుస కాల్స్ చేసి కంగ్రాట్స్ చెబుతున్నారని,మెసేజ్‌లు కూడా పెడుతున్నారని బాధితుడు వాపోతున్నాడు.ఈ తాకిడి తట్టుకోలేక అతను ఫోన్ స్విచ్చాఫ్ చేసేశాన‌ని చెబుతున్నాడు.

Leave a comment