తారుమారైన ట్రేడ్ వర్గాల లెక్కలు.. 5 డేస్ కలెక్షన్స్

రాజా ది గ్రేట్ 5 రోజుల కలెక్షన్స్
మాస్ మహరాజ్ రవితేజ లేటెస్ట్ మూవీ రాజా ది గ్రేట్‌. రవితేజ చాలా గ్యాప్ తర్వాత నటించిన సినిమా కావడం, పైగా దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో పటాస్‌, సుప్రీమ్ సినిమాల డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన సినిమా కావడంతో రాజా ది గ్రేట్‌పై రిలీజ్‌కు ముందే అంచనాలు ఉన్నాయి. బుధవారమే థియేటర్లలోకి దిగిన ఈ సినిమాకు లాంగ్ వీకెండ్‌, దీపావళి కలిసొచ్చాయి. తొలి రోజే రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.5 కోట్ల షేర్ రాబట్టిన ఈ సినిమా ఐదురోజులకు రూ.18 కోట్ల షేర్ రాబట్టింది.
ఇక ప్రపంచవ్యాప్తంగా ఐదు రోజులకు రూ. 33 కోట్ల గ్రాస్ రాబట్టిన ఈ సినిమా ఏపీ, తెలంగాణలోనే రూ.17.73 కోట్ల షేర్ వసూలు చేసింది. రవితేజకు ఇవి కెరీర్ పరంగా బెస్ట్ వసూల్లుగా ఉన్నాయి. ఇక సినిమాకు పోటీ సినిమాలు లేకపోవడంతో పాటు రాజు గారి గది 2 బాక్సాఫీస్ వద్ద డల్ అవ్వడం ఈ సినిమాకు బాగా కలిసిరానుంది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సేఫ్ అవ్వడం ఖాయమని ట్రేడ్ వర్గాలు లెక్కలు వేస్తున్నాయి.
రాజా ది గ్రేట్ 5 డేస్ ఏరియా వైజ్ షేర్ ఇలా ఉంది…..
నైజాం – 6.85
సీడెడ్ – 2.85
ఉత్తరాంధ్ర – 2.19
వెస్ట్ – 1.11
ఈస్ట్ – 1.47
కృష్ణా – 1.22
గుంటూరు – 1.31
నెల్లూరు – 0.82
————————————
ఏపీ తెలంగాణ = 17.73 కోట్లు

Leave a comment